NTV Telugu Site icon

Tejashwi Yadav: ప్రశాంత్ కిషోర్‌కి బీజేపీ నిధులు.. ఎన్నికల వ్యూహమని తేజస్వీ ఆరోపణలు..

Pk, Tekaswi

Pk, Tekaswi

Tejashwi Yadav: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇటీవల పలు ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ.. ఈసారి కూడా ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో బీజేపీ, ఎన్డీయే కూటమి అధికారాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. అయితే బీజేపీ చెబుతున్న ప్రకారం సొంతగా 370 సీట్లు, ఎన్డీయేకి 400+ సీట్లు మాత్రం వచ్చే అవకాశం లేదని చెప్పారు. 2019 ఫలితాలకు సమానంగా లేకపోతే కాస్త ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. అయితే, ఆయన అంచనాలపై ప్రతిపక్ష కాంగ్రెస్, ఇతర ఇండియా కూటమి పార్టీలు విరుచుకుపడుతున్నాయి. ప్రశాంత్ కిషోర్ బీజేపీ ఎజెంట్ అని విమర్శించడం మొదలుపెట్టాయి.

Read Also: US warning: వెనిజులా వెళ్లొద్దని పౌరులకు అమెరికా హెచ్చరిక

తాజాగా లాలూ పార్టీ ఆర్జేడీ నేత, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ శుక్రవారం మాట్లాడుతూ.. ప్రశాంత్ కిషోర్ బీజేపీ ఏజెంట్ అని, బీజేపీ ఎన్నికల్లో ఓడిపోతుందని తెలిసే ఓ కథనాన్ని సెట్ చేయాడానికి ఆయన వ్యాఖ్యలు చేస్తున్నాడని ఆరోపించారు. అమిత్ షా కోరిక మేరకే ప్రశాంత్ కిషోర్‌ను జేడీయూ జాతీయ ఉపాధ్యక్షుడిని చేశానని, నితీష్ కుమార్ కూడా చెప్పారని, ఇప్పటి వరకు అమిత్ షా, ప్రశాంత్ కిషోర్ కానీ ఈ వ్యాఖ్యలపై స్పందించలేదని, ఆయన బీజేపీతో ఉన్నారని అన్నారు.

ప్రశాంత్ కిషోర్ జీతాలు తీసుకునే జిల్లా అధ్యక్షులను పెట్టుకున్నాడని, ఇది బీజేపీకి కూడా లేదని, అతనికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదని, అతను ప్రతీ ఏడాది వేర్వేరు వ్యక్తులతో పనిచేస్తుంటారని, అతను మీ డేటాను తీసుకుని వస్తారు, అతను బీజేపీ ఏజెంట్ మాత్రమే కాదని, బీజేపీ మైండ్ అని, వారి సిద్ధాంతాలను అనుసరిస్తారని బీజేపీ వ్యూహంలో భాగంగా అతనికి నిధులు వస్తున్నాయని తేజస్వీ యాదవ్ ఆరోపించారు. ఇటీవల బీజేపీ ప్రశాంత్ కిషోర్ని జాతీయ అధికార ప్రతినిధిగా నియమించుకుందనే ఓ ఫేక్ న్యూస్ వైరల్ అయిన తర్వాత తేజస్వీ యాదవ్ ఈ వ్యాఖ్యలు చేశారు.