Site icon NTV Telugu

Shashi Tharoor: ముషారఫ్‌పై థరూర్ ట్వీట్.. భగ్గుమన్న బీజేపీ

Shashi Tharoor

Shashi Tharoor

BJP Fires On Shashi Tharoor Tweet On Parvez Musharraf: శాంతికోసం గట్టిగా ప్రయత్నించిన వ్యక్తి అంటూ పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌పై కాంగ్రెస్ నేత శశి థరూర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మన దేశ సైనికులను చిత్రహింసలకు గురి చేసిన వ్యక్తిని.. శాంతి కోసం ప్రయత్నించిన వ్యక్తిగా ఎలా అభివర్ణిస్తారంటూ థరూర్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. అందుకు థరూర్ తిరిగి కౌంటర్ ఇవ్వడంతో.. వివాదం మరింత ముదిరింది. ఇరువురి మధ్య వాగ్వాదం మొదలైంది. ముఖ్యంగా.. థరూర్‌పై బీజేపీ భగ్గుమంటోంది.

Ravindra Jadeja: నేనూ ఆడితే బాగుండేది..గాయంపై జడేజా ఎమోషనల్ కామెంట్స్

‘‘ఒకప్పుడు ముషారఫ్ భారతదేశానికి శత్రువు. కానీ, ఆయనే 2002-2007 మధ్యకాలంలో శాంతి స్థాపనకు నిజమైన శక్తిగా మారారు. ఆ రోజుల్లో ఆయన్ని ప్రతి ఏటా ఐక్యరాజ్య సమితిలో కలిసేవాడ్ని. తన వ్యూహాత్మక ఆలోచనలతో ముషారఫ్ చాలా తెలివిగా, స్పష్టంగా కనిపించేవారు’’ అంటూ ముషారఫ్ మృతిపై సంతాపం వ్యక్తం చేస్తూ థరూర్ ట్వీట్‌ చేశారు. దీనిపై బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది. అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా మన దేశంలో ఉగ్రవాదాన్ని చొప్పించి, భారత సైనికుల్ని హింసించిన వ్యక్తిని శాంతి కోసం ప్రయత్నించాడంటూ ఎలా అభివర్ణిస్తారని నిలదీసింది. థరూర్ చేసిన ఈ ట్వీట్.. కాంగ్రెస్ వైఖరిని ప్రతిబింబిస్తోందంటూ కేంద్రమంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ కూడా విమర్శించారు.

Balakrishna: నర్సులపై చేసిన వ్యాఖ్యల దుమారం.. వక్రీకరంచారంటూ బాలయ్య వివరణ

అందుకు థరూర్ బదులిస్తూ.. ముషారఫ్ భారత్‌కి శత్రువేనని, కార్గిల్ యుద్ధ బాధ్యుడని, కానీ 2002-2007 మధ్యకాలంలో తన స్వప్రయోజనాల కోసం భారత్‌తో శాంతిని బలంగా కోరుకున్నారన్నారు. ముషారఫ్ భారత్‌కి మిత్రుడు కాకపోయినా, శాంతిలోనే ఆయన వ్యూహాత్మక ప్రయోజనాల్ని వెతుక్కున్నారన్నారు. ఇదే సమయంలో ఓ ప్రశ్న కూడా సంధించారు. ‘‘బీజేపీ లీడర్స్‌కి సూటి ప్రశ్న. దేశభక్తి గల భారతీయులకు ముషారఫ్ వ్యతిరేకి అయితే.. 2003లో బీజేపీ ప్రభుత్వం అతనితో కాల్పుల విరమణపై చర్చలు జరిపి, 2004లో వాజ్‌పేయి-ముషారఫ్‌ల జాయింట్ స్టేట్మెంట్‌పై ఎందుకు సంతకం చేసింది? అప్పుడు అతను పీస్ పార్ట్‌నర్‌గా కనిపించలేదా?’’ అని ప్రశ్నించారు.

Exit mobile version