Balakrishna: నర్సులపై చేసిన వ్యాఖ్యల దుమారం.. వక్రీకరంచారంటూ బాలయ్య వివరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nandamuri Balakrishna Responds On Comments About Nurses In Unstoppable Show: నర్సులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ రేగిన దుమారంపై సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తాజాగా స్పందించారు. తాను నర్సులను కించపరిచారనంటూ కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని, తన మాటల్ని కావాలనే వక్రీకరించారంటూ ఫేస్‌బుక్ మాధ్యమంగా వివరణ ఇచ్చారు. ‘‘నర్సులను కించపరిచానంటూ కొందరు చేస్తున్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. నా మాటలను కావాలనే వక్రీకరించారు. రోగులకు సేవలందించే సోదరీమణులంటే నాకెంతో గౌరవం. బసవతారకం కేన్సర్ ఆస్పత్రిలో నర్సుల సేవలను ప్రత్యక్షంగా చూశాను. రాత్రింబవళ్లు రోగులకు సపర్యలు చేసి ప్రాణాలు నిలిపే నర్సులకు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. కరోనా వేళ ప్రపంచవ్యాప్తంగా తమ ప్రాణాలను పణంగా పెట్టి.. ఎంతోమంది నర్సులు పగలనక, రాత్రనక నిద్రాహారాలు మానేసి కరోనా రోగులకు సేవలు అందించారు. అటువంటి నర్సులను మనం మెచ్చుకొని తీరాలి. నిజంగా నా మాటలు మీ మనోభావాలు దెబ్బతీస్తే పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాను’’ అంటూ బాలయ్య వివరించారు.
Kangana Ranaut: నాపై గూఢచర్యం చేస్తున్నారు.. రణ్‌బీర్‌పై కంగనా బాంబ్
Also Read
- NBK DADA : సెట్స్‌లో అడుగుపెట్టిన సింహం.. క్రిస్ట'మాస్' చూపించబోతున్నారు
- Drishyam 3 : దృశ్యం3తో అజయ్ దేవగన్ సాలిడ్ కంబ్యాక్.. రూ. 230 కోట్లు క్రాస్ చేసిన ఫ్యామిలీ థ్రిల్లర్
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
కాగా.. అన్‌స్టాపబుల్ షోలో భాగంగా తనకు వైద్యం అందించిన నర్సు గురించి మాట్లాడుతూ బాలయ్య నోరు జారారు. తనకు ఒక బైక్ యాక్సిడెంట్‌లో దెబ్బలు తగిలాయని.. కానీ కాలు జారి పడటంతో గాయాలు అయ్యాయని అబద్ధం చెప్పి వైద్యం చేయించుకోవాలని అనుకున్నానని బాలయ్య పేర్కొన్నారు. ఆసుపత్రికి వెళ్లిన తర్వాత ఒక నర్సు తన వద్దకు వచ్చిందని, ఆమెను చూసి ‘భలే అందంగా ఉందిలే’ అని అన్నానని చెప్పారు. తనకు దెబ్బలెలా తగిలాయని ఆ నర్సు అడగ్గానే.. అబద్ధం చెప్పాలనుకున్న తన ఆలోచనని విరమించుకొని, నిజం చెప్పానని తెలిపారు. అయితే.. ఆ నర్సుని ఉద్దేశిస్తూ ‘భలే అందంగా ఉందిలే’ అని బాలయ్య చేసిన వ్యాఖ్యలు మాత్రం దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై ఏపీ నర్సింగ్ సంక్షేమ సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. బాలయ్య తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, నర్సులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని ఆ సంఘం డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలోనే బాలయ్య ఫేస్‌బుక్ మాధ్యమంగా స్పందించి, తన మాటలు ఎవరి మనోభావాలనైనా దెబ్బతీస్తే పశ్చాత్తాపడుతున్నానని చెప్పి, వివాదానికి ముగింపు పలికారు.
Bihar Railway Track: బిహార్‌లో మరో వింత ఘటన.. రైల్వే ట్రాక్ దొంగలించిన దుండగులు
తాజావార్తలు
-
NBK DADA : సెట్స్‌లో అడుగుపెట్టిన సింహం.. క్రిస్ట’మాస్’ చూపించబోతున్నారు
-
MG Hector Blackstorm: MG హెక్టర్ బ్లాక్‌స్టార్మ్, స్నోస్టార్మ్ ఎడిషన్స్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనయోగం!
ట్రెండింగ్
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!