NTV Telugu Site icon

Rajya sabha: సభా నాయకుడిగా జేపీ నడ్డా నియామకం

Nadda

Nadda

బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా రాజ్యసభలో సభా నాయకుడిగా నియమితులయ్యారు. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్‌లో హౌస్ లీడర్‌గా నియమితులయ్యారని ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ ప్రకటించారు. దీంతో సభ్యులంతా బల్లలపై చరిచి అభినందించారు.

ఇది కూడా చదవండి: Yogi Adityanath: ఇండియా కూటమి తమిళ సంస్కృతిని ద్వేషిస్తోంది.. ‘సెంగోల్’ వివాదంపై యోగి ఆదిత్యనాథ్

నడ్డా రాజ్యసభలో 264వ సెషన్‌లో గురువారం సభా నాయకుడిగా నియమితులయ్యారు. ఈ ప్రకటన వెలువడే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా సభలోనే ఉన్నారు. ప్రధాని కూడా నడ్డాను అభినందించారు. ఇదిలా ఉంటే సభా నాయకుడిగా నియమించాలని గతంలోనే బీజేపీ నిర్ణయించింది. ఇదే విషయాన్ని రాజ్యసభకు తెలియజేసింది. గురువారం అధికారికంగా రాజ్యసభ చైర్మన్ వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Mosquito Repellent Plants: ఇంట్లో ఈ మొక్కలు పెంచుకుంటే దోమల నివారణ తగ్గించవచ్చు..!

నడ్డా ప్రస్తుతం మోడీ కేబినెట్‌లో కేబినెట్ మంత్రిగా ఉన్నారు. అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు. అయితే త్వరలో కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. అప్పటి వరకు ఆయన బీజేపీ చీఫ్‌గా కొనసాగే అవకాశం ఉందని సమాచారం.

ఇది కూడా చదవండి: Stock Market: మళ్లీ రికార్డుల మోత మోగించిన సెన్సెక్స్, నిఫ్టీ