NTV Telugu Site icon

Haryana Polls: పోటీ నుంచి తప్పుకున్న బీజేపీ అభ్యర్థి.. కారణమిదే..!

Bjpcandidatewithdraws

Bjpcandidatewithdraws

హర్యానా అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ అభ్యర్థి యూటర్న్ తీసుకున్నాడు. తొలి జాబితాలో పెహావా నియోజకవర్గానికి బీజేపీ అభ్యర్థిగా కన్వల్‌జీత్‌సింగ్ అజ్రానా పేరును కమలం పార్టీ ప్రకటించింది. అయితే నామినేషన్ సందర్భగా స్థానిక బీజేపీ నాయకత్వం నుంచి, సిక్కు సంఘం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. వ్యతిరేకతను ముందే పసిగట్టిన అజ్రానా సోమవారమే హైకమాండ్‌కు లేఖ రాశాడు. తనను బరి నుంచి తప్పించాలని విజ్ఞప్తి చేశాడు. అజ్రానా కోరిక మేరకు బీజేపీ అధిష్టానం బరి నుంచి తప్పించింది. మంగళవారం ప్రకటించిన రెండో జాబితాలో అజ్రానాకు బదులుగా జై భగవాన్ శర్మను నియమించింది.

ఇది కూడా చదవండి: Tata: టాటా EV కార్ కొనాలనుకుంటున్నారా, ఇదే మంచి అవకాశం.. రూ. 3 లక్షల వరకు తగ్గింపు..

కురుక్షేత్రలో తన నివాసం నుంచి అజ్రానా మీడియాతో మాట్లాడారు. నామినేషన్‌కు ముందు బీజేపీకి కృతజ్ఞతలు తెలిపారు. అయితే నామినేషన్ సందర్భంగా స్థానిక కేడర్ నుంచి మద్దతు లభించలేదని వాపోయారు. కర్నాల్‌లో జరిగిన సిక్కు సమ్మేళనంలో నిర్వాహకులు సిక్కు సమాజానికి ఎక్కువ రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారని ఆయన పేర్కొన్నారు. తనను అభ్యర్థిగా ప్రకటించాక మాత్రం వ్యతిరేకత వ్యక్తమైందన్నారు. ఒక సర్పంచ్ రాజీనామా చేస్తానని బెదిరించారని.. అలాగే సొంత సంఘం సభ్యుల నుంచి నిరసనలు వ్యక్తమవ్వడంతో తప్పుకున్నట్లు వెల్లడించారు. తాజా పరిణామాలతో తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకుని సోమవారం రాత్రి పార్టీ హైకమాండ్‌కు సమాచారం అందించారు. మొత్తానికి మంగళవారం కొత్త అభ్యర్థిని ప్రకటించింది.

ఇది కూడా చదవండి: Bangladesh: “జమ్మూ కాశ్మీర్ విడిపోవాలి, మమతా బెనర్జీ స్వాతంత్య్రం ప్రకటించుకోవాలి”.. బంగ్లా ఉగ్రనేత వార్నింగ్..

బీజేపీ ఇప్పటివరకు రెండు జాబితాలను ప్రకటించింది. తొలి జాబితాలో 67 మంది, రెండో జాబితాలో 21 మంది అభ్యర్థులను వెల్లడించింది. మొత్తం 88 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా రెండు స్థానాలకు ప్రకటించాల్సి ఉంది. హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అక్టోబర్ 5న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం అక్టోబర్ 8న విడుదల కానున్నాయి.

ఇది కూడా చదవండి: Regina Cassandra : లవ్ మీద పెద్ద ఇంప్రెషన్..చాలా రిఫ్రెషింగ్ .. రెజీనా ఇంటర్వ్యూ