Site icon NTV Telugu

Maithili Thakur: విజయం దిశగా మైథిలి ఠాకూర్.. రాజకీయ కురువృద్ధుడ్ని వెనక్కినెట్టిన గాయని

Maithili Thakur2

Maithili Thakur2

బీహార్ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటేసి భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. సర్వే ఫలితాలకు అనుకూలంగానే ఎన్డీఏ కూటమి దూసుకుపోతుంది. ప్రస్తుతం 171 స్థానాల్లో అధికార కూటమి లీడ్‌లో ఉంది.

ఇక తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన జానపద గాయని మైథిలి ఠాకూర్ కూడా విజయం దిశగా వెళ్తున్నారు. పోస్టల్ బ్యాలెట్‌లో ముందంజలో ఉన్న ఆమె.. ఈవీఎంల కౌంటింగ్‌లో కూడా ఆదిక్యంలో దూసుకెళ్తున్నారు. ఆర్జేడీ సీనియర్ నేత బినోద్ మిశ్రా ప్రస్తుతం వెనుకంజలో ఉన్నారు. ప్రస్తుతం 3,794 ఓట్ల తేడాతో గాయని ముంజంలో ఉంది. వాస్తవంగా అలీనగర్ స్థానం అనేది ఆర్జేడీకి కంచుకోట లాంటిది. ఈ నియోజకవర్గం ఏర్పడిన దగ్గర నుంచి ఆర్జేడీనే గెలుచుకుంటూ వస్తోంది. ఈసారి మాత్రం యువ ఓటర్లంతా మైథిలి ఠాకూర్ వైపు మొగ్గు చూపినట్లుగా కనిపిస్తోంది. మైథిలి ఠాకూర్ గెలిస్తే.. అతిపిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందనుంది.

ఇది కూడా చదవండి: Stock Market: రుచించని బీహార్ ఫలితాలు.. నష్టాల్లో సూచీలు

ఇక ఎన్నికల ఫలితాలు రాకముందు ఓ జాతీయ మీడియాతో మైథిలి ఠాకూర్ మాట్లాడారు. బీహార్ ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆశాభావం వ్యక్తం చేసింది. ఎన్నికల్లో పోటీ చేయడం తన జీవితంలో అత్యుత్తమ నిర్ణయంగా తెలిపారు. సర్వే ఫలితాలు ఎన్డీఏకు అనుకూలంగా ఉన్నాయని.. ఈ నేపథ్యంలో మానసికంగా విజయం సాధిస్తానన్న నమ్మకం ఉందని పేర్కొ్న్నారు. 30 రోజుల ప్రయాణంలో చాలా సంతోషంగా ఉన్నట్లు చెప్పారు. సంతృప్తిగా ఉన్నాను కాబట్టే గెలుస్తానో.. ఓడిపోతానో అని ఒక్క క్షణం కూడా ఆలోచించలేదన్నారు. విజయంపై పూర్తి నమ్మకం ఉందని తెలిపారు. అలీనగర్‌లోనే ఉంటూ ప్రజలకు సేవ చేస్తానన్నారు.

ఇది కూడా చదవండి: Delhi Car Blast: పుల్వామాలో ఉగ్రవాది ఉమర్ ఇంటిని పేల్చేసిన దళాలు

Exit mobile version