NTV Telugu Site icon

Doctor Murder Case: నేడు బెంగాల్లో 12 గంటల పాటు బంద్కు పిలుపునిచ్చిన బీజేపీ..

Bjp Bengal

Bjp Bengal

Doctor Murder Case: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జూనియర్ డాక్టర్ హత్యాచారం, హత్య కేసులో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతుంది. మంగళవారం బెంగాల్ రాష్ట్ర సచివాలయం నవన్‌కు విద్యార్థి సంఘం నిర్వహించిన మార్చ్‌లో పాల్గొన్న వారిపై పోలీసుల లాఠీచార్జ్, టియర్ గ్యాస్, వాటర్ క్యాన్లతో అడ్డుకున్నారు. ఈ చర్యకు నిరసనగా ఇవాళ ( బుధవారం) రాష్ట్రంలోని ప్రతిపక్ష బీజేపీ బెంగాల్‌లో 12 గంటల బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ విషయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత్ మజుందార్ ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బంద్‌ పాటించాలని కోరారు.

Read Also: Off The Record: హైడ్రా కూల్చివేతలపై రాజకీయాల్లో రచ్చ రచ్చ..

కాగా, మహిళా వైద్యురాలిపై అత్యాచారం, హత్యకు గురైన ఘటనపై ప్రజల బాధలను ఆసరాగా చేసుకుని రాష్ట్రంలో అశాంతి సృష్టించేందుకు బీజేపీ కుట్ర చేస్తుందని అధికార తృణమూల్ కాంగ్రెస్ పేర్కొంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఎలాంటి బంద్‌ను అనుమతించబోదని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముఖ్య సలహాదారు అలపన్ బంద్యోపాధ్యాయ తెలిపారు. ఈరోజు ప్రభుత్వ కార్యాలయాలు తెరిచే ఉంటాయని వెల్లడించింది. ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే బంద్ కారణంగా సాధారణ జన జీవనం దెబ్బ తినకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని తెలిపింది.