మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎంపిక బీజేపీ అధిష్టానానికి కత్తిమీద సాములా తయారైంది. నవంబర్ 23న మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చాయి. దాదాపు నేటికి 9 రోజులైంది. అయినా కూడా ఈనాటికి సీఎం అభ్యర్థిని ఎంపిక చేయలేకపోయారు. హైకమాండ్ పెద్దలు ఢిల్లీకి పిలిపించి చర్చలు జరిపినా ప్రయోజనం లేకుండా పోయింది.