Site icon NTV Telugu

Maharashtra: డిసెంబర్ 5న మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం.. ప్రకటించిన బీజేపీ..

Maharashtra

Maharashtra

Maharashtra: మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు డెడ్‌లైన్ పెట్టుకుంది బీజేపీ. కొత్త మంత్రివర్గ ప్రమాణస్వీకారోత్సవ తేదీని బీజేపీ ప్రకటించింది. అయితే, ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. డిసెంబర్ 05 సాయంత్రం 5 గంటలకు ముంబైలోని ఐకానిక్ ఆజాద్ మైదాన్‌లో ఈ వేడుకలు జరగనున్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఏకంగా 288 అసెంబ్లీ స్థానాల్లో 233 సీట్లలో గెలిచింది. 132 స్థానాల్లో గెలిచి బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. కూటమిలోని ఏక్‌నాథ్ షిండే శివసేన 57, అజిత్ పవార్ ఎన్సీపీ 41 సీట్లు గెలుచుకున్నారు.

Read Also:CM Revanth Reddy: నల్లమలలో పెరిగిన పులులు, తోడేళ్లు చూశా.. మీ కుట్రలు ఎంత?

బీజేపీ కూటమి ధాటికి ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమి కేవలం 46 స్థానాలకే పరిమితమైంది. శివసేన ఠాక్రే వర్గం 20, ఎన్సీపీ శరద్ పవార్ 10 సీట్లలో గెలుపొందాయి. కాంగ్రెస్ 100 సీట్లకు పైగా పోటీ చేస్తే కేవలం 16 సీట్లలో మాత్రమే గెలిచింది.

ఇదిలా ఉంటే, ఫలితాలు వచ్చి వారం గడిచిన మహారాష్ట్ర సీఎం ఎవరనే దానిపై క్లారిటీ రాలేదు. బీజేపీ దేవేంద్ర ఫడ్నవీస్‌ని సీఎం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్‌లకు డిప్యూటీ సీఎం పోస్టులు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. సీఎం పోస్టుపై ఢిల్లీలో, ముంబైలో విస్తృత చర్చలు కొనసాగుతున్నాయి. షిండే డిప్యూటీ సీఎంతో పాటు హోం మంత్రిత్వ శాఖ కోరుతున్నట్లు సమాచారం. అయితే, బీజేపీ మాత్రం సీఎం, హోం మినిస్ట్రీ తన వద్దే పెట్టుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

Exit mobile version