Lok Sabha polls: విడిపోయిన మిత్రులను బీజేపీ దగ్గరకు చేర్చుకుంటోంది. లోక్‌సభ ఎన్నికల్లో 400కి పైగా సీట్లను లక్ష్యంగా పెట్టుకున్న ఏన్డీయే కూటమి, అందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. పాత మిత్రులను అక్కున చేర్చుకుంటోంది. ఇప్పటికే పాత మిత్రలైన తెలుగు దేశం పార్టీ, కర్ణాటకలో జేడీఎస్ పార్టీలు ఏన్డీయేలోకి చేరాయి. అయితే, తాజాగా పంజాబ్‌కి చెందిన శిరోమణి అకాలీదళ్(ఎస్ఏడీ) మధ్య పొత్తుపూ చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. పంజాబ్‌లోని 13 లోక్‌సభ స్థానాలకు జూన్ 1న పోలింగ్ జరగనుంది. గతంలో ఎన్డీయే కూటమిలో ఉన్న అకాలీదల్, మూడు రైతు చట్టాలకు వ్యతిరేకంగా కూటమి నుంచి బయటకు వచ్చింది. ఆ తర్వాత పంజాబ్ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతింది. ఆప్, కాంగ్రెస్ ధాటికి కీలక అకాలీదళ్ నేతలు పరాజయం పాలయ్యారు.
Read Also: Pallavi Prasanth : శివాజీకి గురుదక్షిణ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. అన్నా ఏంటి ఇలా ఝలక్ ఇచ్చావు..
ఇదిలా ఉంటే, పంజాబ్‌లో రెండు పార్టీల మధ్య పొత్తు కోసం చర్చలు జరుగుతున్నట్లు బీజేపీ సీనియర్ నాయకుడు, అధికార ప్రతినిధి ఎస్ఎస్ చన్నీ తెలిపారు. చర్చలు జరుగుతున్నాయని, మార్చి 22న అకాలీదళ్ కోర్ కమిటీ సమావేశమవుతోందని, ఆ తర్వాత బీజేపీ, అకాలీదళ్ మధ్య సమావేశం జరుగుతుందని, పొత్తుపై తుది నిర్ణయం ఉంటుందని చెప్పారు.
అకాలీదళ్ సీనియర్ నేత, పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ దల్జీత్ సింగ్ చమీ కూడా పొత్తును ధృవీకరించారు. చండీగఢ్‌లో జరగబోయే కోర్ కమిటీ సమావేశంలో పొత్తుతో పాటు పలు అంశాలపై చర్చిస్తామని అన్నారు. రైతులకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ), సిక్కు ఖైదీల విడుదల వంటి అపరిష్కృత సమస్యల కారణంగా అకాలీదల్ బీజేపీతో పొత్తుతో వెనకడుగు వేస్తోంది. అకాలీదల్-బీజేపీ పొత్తుపై ప్రతిపక్ష నేత ప్రతాప్ సింగ్ బజ్వా ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు అకాలీదల్, రైతుల సమస్య, మతంపై దాని వైఖరికి హానికరం అని పేర్కొన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లోని 13 లోక్‌సభ స్థానలకు గానూ 8 స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంటే, బీజేపీ, అకాలీదళ్ చెరో రెండు సీట్లు, ఆప్ ఒక్కసీటును కైవసం చేసుకుంది.
