Site icon NTV Telugu

Sanjay Raut: ఉద్ధవ్ ఠాక్రేకి బీజేపీ భయపడుతోంది.. అమిత్ షా “ద్రోహం” వ్యాఖ్యలపై కామెంట్స్..

Sajay Raut

Sajay Raut

Sanjay Raut: 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి ఉద్ధవ్ ఠాక్రే ద్రోహం చేశారని అమిత్ షా ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై శివసేన(యూబీటీ) నాయకుడు, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. కేంద్రమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై విరుచుకపడ్డారు. ఉద్దవ్ ఠాక్రేని చూసి బీజేపీ భయపడుతోందని వ్యాఖ్యానించారు. శనివారం నాందేడ్ లో జరిగిన అమిత్ షా ర్యాలీని సంజయ్ రౌత్ ప్రస్తావసి్తూ.. ఉద్ధవ్ ఠాక్రేని చూసి బీజేపీ భయపడటం విశేషం అన్నారు.

Read Also: WTC FINAL 2023: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ విజేత ఆస్ట్రేలియా.. ఇండియా ఘోర పరాజయం

‘‘ ఉద్ధవ్ ఠాక్రేని చూసి బీజేపీ భయపడటం మంచిది. అది శివసేన పార్టీలో చీలిక తీసుకువచ్చిందని నిర్థారిస్తుంది. దేశద్రోహులకు పార్టీ పేరు, చిహ్నాన్ని ఇచ్చింది. ఇప్పటికీ ఉద్దవ్ ఠాక్రే, శివసేన భయం పోలేదు’’ అంటూ సంజయ్ రౌత్ తన సోషల్ మీడియా హ్యాండిల్ లో ట్వీట్ చేశారు. అమిత్ షా 20 నిమిషాలు మాట్లాడితే..అందులో ఏడు నిమిషాలు ఉద్దవ్ ఠాక్రే గురించే మాట్లాడారని, ఆయన ప్రసంగం వినోదభరితంగా ఉందని, నాందేడ్‌లో ఆయన ర్యాలీ బిజెపి మహా సంపర్క్ అభియాన్‌లో భాగమా లేదా ఠాక్రేని విమర్శించే ర్యాలినా?? అని నేను ఆశ్చర్యపోతున్నానని అన్నారు.

అంతకుముందు శనివారం నాందేడ్ సభలో అమిత్ షా మాట్లాడుతూ.. బీజేపికి ద్రోహం చేసి ఉద్దవ్ ఠాక్రే ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో చేతులు కలిపారని ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కావడానికి ఉద్దవ్ ఠాక్రే బీజేపీని వదులుకుందని అమిత్ షా విమర్శించారు. నేను బీజేపీ అధ్యక్షుడిగా , అప్పటి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఠాక్రేతో చర్చలు జరిపామని, అయితే ఎన్డీయే విజయం సాధిస్తే ఫడ్నవీస్ సీఎం అవుతారని హామీ ఇచ్చిన తర్వాత, ఠాక్రే మాటతప్పారని అమిత్ షా ఆరోపించారు.

Exit mobile version