NTV Telugu Site icon

Pune: 16 మందిని బలిగొన్న ముంబై ఘటన తర్వాత పూణేలో కుప్పకూలిన భారీ హోర్డింగ్..

Pune

Pune

Pune: ఇటీవల ముంబైలో బిల్‌బోర్డు కుప్పకూలిన ఘటనలో 16 మంది మరణించారు. ఈ ఘటన మరవకముందే పూణేలో ఇలాంటి ప్రమాదమే జరిగింది. బలమైన గాలుల కారణంగా పూణే సమీపంలోని పింప్రి-చించ్‌వాడ్‌లో హోర్డింగ్ కూలిపోయింది. హోర్డింగ్ కింద ఆగి ఉన్న టెంపో, కారు, కొన్ని ద్విచక్ర వాహనాలపై విరిగి పడింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు.

ఈ సంఘటన గురువారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో నగరంలోని మోషి ప్రాంతంలో చోటు చేసుకుంది. ఘటన జరిగిన వెంటనే అగ్నిమాపక శాఖ, పోలీసులు, ఇతర అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పింప్రి-చించ్‌వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ ఇన్‌ఛార్జ్ అగ్నిమాపక అధికారి మనోజ్ లోంకర్ మాట్లాడుతూ, ప్రజలకు ఎలాంటి ప్రమాదం జరగలేని చెప్పారు.

Read Also: Slovakia PM: స్లోవేకియా ప్రధానిపై కాల్పుల ఘటన.. వీడియో చూశారా..?

గతేడాది ఏప్రిల్‌లో పింప్రి చించ్‌వాడ్‌లోని సర్వీస్‌ రోడ్డుపై హోర్డింగ్‌ కూలి ఐదుగురు మృతి చెందారు. బలమైన ఈదురుగాలులు, వర్షం వస్తుండటంతో తలదాచుకుందామని వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం ముంబైలో భారీ హోర్డింగ్ కూలి 16 మంది మరణించారు. 75 మంది తీవ్రంగా గాయపడ్డారు. దుమ్ము తుఫాను కారణంగా సోమవారం 250 టన్నుల హోర్డింగ్ కూలిపోయింది. ఈ ఘటనలో నాలుగు రోజుల నుంచి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ దుర్ఘటనలో మరణించిన వారికి ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం రూ. 5 లక్షల పరిహారం ప్రకటించింది. గాయపడిన వారికి చికిత్స ఖర్చుల్ని ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు.