Bilkis Bano Case: బిల్కిస్ బానో గ్యాంగ్‌రే*ప్ కేసు.. 17 ఏళ్ల తర్వాత ఇద్దరు దోషులకు సుప్రీంకోర్టు బెయిల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bilkis Bano Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో సామూహిక అత్యాచారం, ఆమె కుటుంబ సభ్యుల హత్య కేసులో ఇద్దరు దోషులకు సుప్రీంకోర్టు నుంచి ఊరట లభించింది. వారికి విధించిన జీవిత ఖైదు శిక్షను సస్పెండ్ చేస్తూ, బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే 17 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించడం, వారిలో ఒకరు తీవ్ర వైకల్యంతో బాధపడుతుండటం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. జస్టిస్ ఎం.ఎం. సుందరేష్, జస్టిస్ ప్రసన్న బి. వరాలేతో కూడిన ధర్మాసనం అక్టోబర్ 28న ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
సుప్రీంకోర్టు నుంచి బెయిల్ పొందిన ఇద్దరు దోషులను విపిన్‌చంద్ర కన్హయ్యాలాల్ జోషి, ప్రదీప్ రామన్‌లాల్ మోధియాగా గుర్తించారు. వీరిద్దరూ ఈ కేసులో దోషులుగా తేలిన 11 మందిలో ఉన్నారు. వీరికి గతంలో కల్పించిన ముందస్తు విడుదలను సుప్రీంకోర్టు 2024 జనవరిలో రద్దు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఇద్దరు దోషులు దాఖలు చేసిన పిటిషన్లను పరిశీలించిన సుప్రీంకోర్టు.. వారు ఇప్పటికే 17 ఏళ్లకు పైగా జైలు జీవితం గడిపిన విషయాన్ని పరిగణనలోకి తీసుకుంది. అలాగే వారిలో ఒకరు తీవ్ర వైకల్యంతో బాధపడుతున్న అంశాన్ని కూడా పరిశీలించింది. ఈ నేపథ్యంలో వారి జీవిత ఖైదు శిక్షను తాత్కాలికంగా నిలిపివేస్తూ బెయిల్ మంజూరు చేసింది. అయితే, వారి దోష నిర్ధారణకు వ్యతిరేకంగా దాఖలైన అప్పీళ్లపై విచారణ కొనసాగుతుందని స్పష్టం చేసింది.
Also Read
- CM Vijaya: తమిళనాడు సర్కార్ సంచలన నిర్ణయం.. 92 వేల మంది రైతులు, టీచర్లకు భారీ ఊరట
- PM Modi Manila Visit 2026: PM మోడీ మనీలా పర్యటన.. ఆసియాన్ సదస్సులో భారత్ ప్రధాన లక్ష్యాలివే
- Akhilesh Ayodhya Visit: ‘‘నమాజ్ చేసిన ప్రాంతానికి వెళ్తున్నారు’’.. అఖిలేష్ ‘‘రామమందిర’’ సందర్శనపై ఓవైసీ వ్యాఖ్యలు..
- BJP: ఇటలీ నేత ‘ఓట్ చోర్’ నినాదం.. రాహుల్ గాంధీ నవ్వులపై బీజేపీ మండిపాటు!
సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా దోషుల తరఫు న్యాయవాదులు కీలక వాదనలు వినిపించారు. వారిలో ఒకరి పేరు మొదట నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో లేదని, ఘటన జరిగిన సుమారు మూడేళ్ల తర్వాత అతడిని నిందితుడిగా చేర్చారని కోర్టుకు తెలిపారు. మరోవైపు, దోషులకు బెయిల్ మంజూరు చేయడాన్ని గుజరాత్ ప్రభుత్వం వ్యతిరేకించింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. అప్పీళ్లలో వాస్తవాలు, చట్టపరమైన అంశాలను మరింత లోతుగా పరిశీలించాల్సి ఉందని పేర్కొంది.
ఇద్దరు దోషులకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు.. వారు పాటించాల్సిన బెయిల్ షరతులను సంబంధిత ట్రయల్ కోర్టు నిర్ణయిస్తుందని స్పష్టం చేసింది. అదే సమయంలో వారి దోష నిర్ధారణను సవాలు చేస్తూ దాఖలైన అప్పీళ్లపై విచారణ కొనసాగుతుందని తెలిపింది. ఇద్దరు దోషులకు బెయిల్ మంజూరు చేయడం మరోసారి ఈ కేసును దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మార్చింది.
తాజావార్తలు
-
Bilkis Bano Case: బిల్కిస్ బానో గ్యాంగ్‌రే*ప్ కేసు.. 17 ఏళ్ల తర్వాత ఇద్దరు దోషులకు సుప్రీంకోర్టు బెయిల్!
-
AOT Trailer: పది మంది నవ్వితే ఏంటి, ఒక్కరు నమ్మితే చాలదా.. హృదయానికి హత్తుకునేలా ఏవోటీ ట్రైలర్!
-
Teja Sajja Engagement: ఘనంగా తేజ సజ్జా నిశ్చితార్థ వేడుక.. హాజరైన ప్రముఖులు..!
-
Cyclone Aquan Alert: అక్వాన్ తుఫాన్‌పై ఏపీ ప్రభుత్వం అలర్ట్.. యాక్షన్ ప్లాన్ రెడీ.. అధికారులకు కీలక ఆదేశాలు
-
Ramayana Box Office Collections: ‘రామాయణ’ రికార్డుల వేట.. ‘ధురంధర్ 2’ మరో రికార్డు బద్దలు!
ట్రెండింగ్
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్‌గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!
-
Tata Motors దూకుడు మాములుగా లేదుగా.. 10 నెలల్లోనే గతేడాది లెక్కలు తారుమారు.!