దేశ రాజధాని ఢిల్లీలో అధికారుల నిర్లక్ష్యం ఓ యువకుడి ప్రాణాలు బలి తీసుకుంది. నడిరోడ్డుపై ఢిల్లీ జల్ బోర్డు తవ్విన గుంత కారణంగా నిండు ప్రాణం పోయింది. ఈ ఘటన జనక్‌పురిలో జరిగింది. ఈ ఘటనపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమంటూ ధ్వజమెత్తింది.
జనక్‌పురిలో ఢిల్లీ జల్ బోర్డు భారీ గుంత తవ్వి ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకుండా నిర్లక్ష్యంగా అలా వదిలేశారు. దీంతో ఓ యువకుడు బైక్‌పై వేగంగా వస్తూ గుంతలో పడిపోయి ప్రాణాలు వదిలాడు. అయితే కుమారుడి జాడ తెలియక తల్లిదండ్రులు రాత్రంతా వెతికారు. పోలీసులను ఆశ్రయించారు. అయినా కూడా సమాచారం దొరకలేదు. గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. చీకటిగా ఉండడంతో ప్రజలెవరూ గమనించలేదు. శుక్రవారం ఉదయం 7 గంటలకు వెలుగు రావడంతో గుంతలో యువకుడి మృతదేహం కనిపించింది. పోలీసులు.. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో తమ కుమారుడేనని గుర్తించారు. దీంతో కన్నీరు మున్నీరుగా విలపించారు.
ప్రమాద స్థలంలో ఢిల్లీ జల్ బోర్డు పనులు జరుగుతున్నాయని.. రోడ్డుపై లోతైన గోతి తవ్వారని స్థానికులు చెప్పారు. ఎటువంటి హెచ్చరిక బోర్డులు, బారికేడ్లు ఏర్పాటు చేయలేదన్నారు. రాత్రిపూట చీకటిగా ఉండడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా పేర్కొన్నారు. ఉదయాన్నే స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇక ఈ ఘటనపై ఆప్ నేత, మాజీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని ధ్వజమెత్తారు. ‘‘ఒక అమాయక బైకర్ లోతైన గుంతలో పడి రాత్రంతా అక్కడే ఉండి చనిపోయాడని.. నోయిడా సంఘటన నుంచి బీజేపీ ప్రభుత్వం ఏమీ నేర్చుకోలేదు. వారు ప్రతిరోజూ అబద్ధాలు చెబుతారు.’’ అని పేర్కొన్నారు.
మంత్రి ఆశిష్ సూద్ దర్యాప్తు
ప్రమాద ఘటనపై మంత్రి ఆశిష్ సూద్ నియోజకవర్గంలోనే ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే దర్యాప్తునకు మంత్రి ఆదేశించారు. ఢిల్లీ జల్ బోర్డు ఓపెన్ చేసి పెట్టిందా? మరేదైనా ఏజెన్సీ పనిచేస్తుందా? ప్రమాదం జరిగిన సమయంలో భద్రతా ప్రమాణాలను ఎందుకు పాటించలేదు?.’’ అని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
Shocking !!!
सड़क में गहरे गड्ढे में एक मासूम बाइक सवार गिर कर फँस गया, रात भर पड़ा रहा और मर गया
नोएडा की घटना से दिल्ली की भाजपा सरकार ने कुछ नहीं सीखा। बस रोज़ झूठ बोला जाता है।
जनकपुरी डिस्ट्रिक्ट सेंटर, दिल्ली pic.twitter.com/4WJr1tLdiI
— Saurabh Bharadwaj (@Saurabh_MLAgk) February 6, 2026
