Site icon NTV Telugu

Bihar Politics: బీజేపీతో జేడీయూ తెగదెంపులు.. గవర్నర్ అపాయింట్మెంట్ కోరిన సీఎం నితీష్ కుమార్

Bihar Politics

Bihar Politics

Bihar Politics: బీజేపీతో జేడీయూ దాదాపుగా తెగదెంపులు చేసుకున్నట్లే కనిపిస్తోంది. తాజాగా ఈరోజు జేడీయూ ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశం అయ్యారు నితీష్ కుమార్. బీజేపీ కూటమితో ప్రభుత్వంలో ఉండటం తన మనుగడకే ముప్పు వాటిల్లుతోందని.. జేడీయూ అభిప్రాయపడుతోంది. దీంతో పాటు ఇటీవల ఆర్సీపీ సింగ్ వ్యవహారం కూడా జేడీయూ పార్టీకి రాజీనామా చేశారు. చేస్తూ.. చేస్తూ..నితీష్ కుమార్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఇదిలా ఉంటే జేడీయూ అదిరిపోయే వార్త చెబుతానంటూ నితీష్ కుమార్ వెల్లడించినట్లు సమాచారం. ఇందుకు బలం కూర్చేలా నితీష్ కుమార్ గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు. దీంతో బీజేపీ, జేడీయూ బంధం దాదాపుగా తెగిపోయినట్లే అని తెలుస్తోంది. అయితే చివరి ప్రయత్నంగా సీఎం నితీష్ కుమార్ కు కేంద్ర హోమంత్రి అమిత్ షా ఫోన్ చెసినట్లు తెలుస్తోంది. మరోవైపు నితీష్ కుమార్ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో టచ్ లో ఉన్నారు.

ఇక రాష్ట్రీయ జనతా దళ్( ఆర్జేడీ), జేడీయూతో జట్టు కట్టేందుకు సముఖంగా ఉంది. ఇప్పటికే లాలూ ప్రసాద్ యాదవ్ నివాసంలో ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్ష ఎమ్మెల్యేల సమావేశం జరుగుతోంది. ఇటు బీజేపీ నేతలు కూడా డిప్యూటీ సీఎం తార్ కిషోర్ ప్రసాద్ నివాసంలో భేటీ అయ్యారు. బీహార్ పరిస్థితులను నిషితంగా గమనిస్తున్నారు. మరో వైపు బీజేపీకి చెందిన 16 మంది మంత్రులు రాజీనామా చేసేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే నితీష్ సారథ్యంలో ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలో మహాఘట్ బంధన్ కూటమి ఏర్పాటుపై చర్చ జరుగుతోంది.

Read Also: Kinjarapu Rammohan Naidu: ఎంపీ మాధవ్ పై చర్య తీసుకోవాల్సిందే!

గత నెల నుంచి బీజేపీపై, ఎన్డీయే కూటమిపై జేడీయూ, ముఖ్యంగా సీఎం నితీష్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆర్సీపీ సింగ్, నితీష్ కుమార్ కు సంబంధం లేకుండా కేంద్ర మంత్రి పదవిని తీసుకోవడం ఈ వివాదానికి మూలం అయింది. ఇటీవల ఆర్సీపీ సింగ్.. జేడీయూకు రాజీనామా చేస్తూ.. నితీష్ ఏడు జన్మలెత్తిన ప్రధాని కాలేడనే వ్యాఖ్యలు చేశారు. అయితే గతంలో బీహార్ లో పర్యటించిన కేంద్ర మంత్రి అమిత్ షా.. 2024లో నితీష్ కుమారే మా సీఎం అంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే రాష్ట్రంలో జరిగే పరిణామాలు మాత్రం వేరేలా ఉన్నాయని జేడీయూ, సీఎం నితీష్ కుమార్ భావిస్తున్నారు.

ప్రస్తుతం బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 స్థానాలు ఉంటే బీజేపీకి 77, ఆర్జేడీకి 79, జేడీయూకు 45, కాంగ్రెస్ కు 19, వామపక్షాలకు 16 మంది ఎమ్మెల్యేలు ఉంటే.. ఎంఐఎంకు ఒక ఎమ్మెల్యే ఉన్నారు. దీంతో బీజేపీని కాదన్నా కూడా ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో జేడీయూ మెజారిటీ మార్క్ దాటి సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది.

Exit mobile version