Bihar Bank Account Glitch: పింఛను తీసుకునే తండ్రీకొడుకుల ఖాతాలో.. ఏకంగా రూ. 1500 కోట్ల బ్యాలెన్స్..!
- బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో ఓ ఆశ్చర్యకర ఘటన
- పింఛను తీసుకునేందుకు వెళ్లగా కనిపించిన భారీ మొత్తం
- ఒక్కో ఖాతాలో రూ.759 కోట్లకు పైగా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో ఓ ఆశ్చర్యకర ఘటన వెలుగులోకి వచ్చింది. వృద్ధాప్య పింఛను, దివ్యాంగ పింఛను తీసుకునేందుకు బ్యాంకు కేంద్రానికి వెళ్లిన తండ్రీకొడుకులు తమ ఖాతాల్లో కనిపించిన భారీ మొత్తాన్ని చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వారి రెండు బ్యాంకు ఖాతాల్లో కలిపి సుమారు రూ.1,500 కోట్లకు పైగా బ్యాలెన్స్ కనిపించడం స్థానికంగా సంచలనంగా మారింది.
పింఛను తీసుకునేందుకు వెళ్లగా కనిపించిన భారీ మొత్తం
సక్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని థాటియా సిహో గ్రామానికి చెందిన కామేశ్వర్ మిశ్రా (అలియాస్ “ఘుమ్కర్”) తన వృద్ధాప్య పింఛను తీసుకునేందుకు గ్రామంలోని సీఎస్సీ (కామన్ సర్వీస్ సెంటర్) కేంద్రానికి వెళ్లారు. ఆయనతో పాటు దివ్యాంగ పింఛను పొందుతున్న కుమారుడు కూడా ఉన్నాడు. పింఛను నగదు తీసుకున్న అనంతరం ఇద్దరూ తమ బ్యాంకు ఖాతాల్లో మిగిలిన బ్యాలెన్స్‌ను పరిశీలించగా, అక్కడ కనిపించిన మొత్తం వారిని అవాక్కయ్యేలా చేసింది.
Also Read
- Vladimir Putin: "రష్యాపై 30 వేలకుపైగా ఆంక్షలు మోపారు".. అమెరికా వైఖరిపై పుతిన్ ఫైర్..!
- Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
- Devasish Sharma: IAS పదవికి రాజీనామా.. 8 రోజుల్లోనే బీజేపీ ఎంపీ టికెట్.. దేవాశిష్ శర్మ ఎవరు?
- Sergio Gor: మణిపూర్‌లో సెర్గియో గోర్ పర్యటన.. గవర్నర్, సీఎంతో భేటీ!
ఒక్కో ఖాతాలో రూ.759 కోట్లకు పైగా
బ్యాంకు ఖాతా వివరాల ప్రకారం, కామేశ్వర్ మిశ్రా ఖాతాలో సుమారు రూ.759 కోట్లకు పైగా (రూ.7.59 బిలియన్) బ్యాలెన్స్ కనిపించింది. ఇదే తరహాలో ఆయన కుమారుడి ఖాతాలో కూడా దాదాపు అంతే మొత్తం నమోదైంది. దీంతో రెండు ఖాతాల్లో కలిపి సుమారు రూ.1,500 కోట్లకు పైగా బ్యాలెన్స్ కనిపించినట్లు సమాచారం. ఈ విషయాన్ని చూసిన కుటుంబ సభ్యులతో పాటు సీఎస్సీ కేంద్రం నిర్వాహకులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు.
“నేను సామాన్య వ్యక్తిని”.. కామేశ్వర్ మిశ్రా
‘సంచార కవి’గా స్థానికంగా పేరుగాంచిన కామేశ్వర్ మిశ్రా మాట్లాడుతూ, తాను సాధారణ వ్యక్తినని, తన ఖాతాలో ఇంత భారీ మొత్తం ఎలా కనిపించిందో తనకు ఏమాత్రం అర్థం కావడం లేదని చెప్పారు. ఈ వ్యవహారంపై బ్యాంకు అధికారులు పూర్తిస్థాయి విచారణ చేపట్టి, ఖాతాలోని వాస్తవ బ్యాలెన్స్‌ను వెల్లడించాలని ఆయన కోరారు.
బ్యాంకింగ్ లోపమా?
ప్రస్తుతం ఈ ఘటనకు గల అసలు కారణం తెలియరాలేదు. బ్యాంకింగ్ వ్యవస్థలో సాంకేతిక లోపం లేదా సాఫ్ట్వేర్ సమస్య కారణంగా ఈ భారీ మొత్తం ఖాతాల్లో కనిపించి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే, ఈ ఘటనపై సంబంధిత బ్యాంకు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. విచారణ అనంతరం అసలు విషయం వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఘటన సోషల్ మీడియాలో కూడా వైరల్‌గా మారగా, బ్యాంకింగ్ వ్యవస్థలో ఇలాంటి సాంకేతిక లోపాలపై మరోసారి చర్చ మొదలైంది.
తాజావార్తలు
-
Idupu Kayitham Song: ప్రియదర్శి ‘శ్రీలత’ పాట అదిరిపోయిందిగా.. తెలంగాణ నేటివిటీతో కట్టిపడేస్తున్న రొమాంటిక్ మెలోడీ!
-
Nivin Pauly : మలయాళం ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్ దిశగా ‘బెత్లెహేమ్ కుటుంబ యూనిట్’
-
Vladimir Putin: “రష్యాపై 30 వేలకుపైగా ఆంక్షలు మోపారు”.. అమెరికా వైఖరిపై పుతిన్ ఫైర్..!
-
Houthis Capture Perim Island: సౌదీ అరేబియాకు భారీ షాక్.. పెరిమ్ ద్వీపంపై హౌతీల పట్టు, అరామ్కో పైప్‌లైన్‌కు నష్టం!
-
Manav Suthar Record: 131 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు.. చరిత్ర సృష్టించిన భారత స్పిన్నర్
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?