Tollywood Sentiments : టాలీవుడ్లో కొత్త సెంటిమెంట్.. పెళ్ళి తర్వాత బ్లాక్‌బస్టర్ గ్యారెంటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిత్ర పరిశ్రమలో సెంటిమెంట్లకు కొదవలేదు. ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ నడుస్తుంటుంది. ప్రస్తుతం టాలీవుడ్లో ఒక ఆసక్తికరమైన సెంటిమెంట్ ట్రెండ్ అవుతోంది. అదే “మ్యారేజ్ సెంటిమెంట్“. చాలా కాలంగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న హీరోలు లేదా స్టార్స్.. పెళ్లి తర్వాత బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే రేంజ్లో ‘కంబ్యాక్’ ఇస్తున్నారనే కొత్త చర్చ తెరపైకి వచ్చింది.ఇటీవల కాలంలో ఈ సెంటిమెంట్‌ను నిజం చేస్తూ సాగిన కొందరు సెలబ్రిటీల జోడీలు మరియు వారి కంబ్యాక్ చిత్రాలను చూస్తే..
కిరణ్ అబ్బవరం వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న సమయంలో తన మొదటి సినిమా హీరోయిన్ రహస్య గోరఖ్‌ను వివాహం చేసుకున్నారు. పెళ్లి పీటలు ఎక్కిన కొద్ది రోజులకే కిరణ్ నటించిన పిరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘క‘ విడుదలై భారీ వసూళ్లతో అద్భుతమైన విజయాన్ని అందుకొని కిరణ్ కెరీర్‌కు ఊహించని రీతిలో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చింది.
Also Read
అక్కినేని నాగ చైతన్య వైవాహిక జీవితంలో కొత్త అడుగు వేస్తూ శోభిత ధూళిపాళ్లను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత చందు మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య, నటించిన రగ్గడ్ ఫిషర్మెన్ డ్రామా ‘తండేల్‘. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం నాగ చైతన్య నటనకు కెరీర్‌కు మైలురాయిగా నిలిచి సాలిడ్ కంబ్యాక్‌గా నిలిచింది.
సమంత కూడా తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒడిదొడుకులను అధిగమించి, కొత్త లైఫ్ మరియు మైండ్ సెట్‌తో కెరీర్‌పై పూర్తి ఫోకస్ పెట్టి తన సొంత బ్యానర్లో పవర్ఫుల్ గన్ పట్టి చేసిన మా ఇంటి బంగారం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. రూ. 100 కోట్ల వసూళ్లతో లేడి ఓరియెంటెడ్ సినిమాలో కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది. జీవితంలో కొత్త స్పూర్తితో అడుగులు వేయడం ఆమెకు బాగా కలిసి వచ్చింది.
అక్కినేని అఖిల్ ఇటీవల జైనబ్ రవ్జీని సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. ‘ఏజెంట్’ వంటి భారీ పరాజయం తర్వాత దాదాపు రెండేళ్లు గ్యాప్ తీసుకున్న అఖిల్.. పెళ్లి తర్వాత సితార ఎంటర్టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ కాంబినేషన్లో సరికొత్త లుక్‌తో ‘లెనిన్‘ ద్వారా రీ-ఎంట్రీ ఇచ్చి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.
మొత్తానికి ‘ఒక ఇంటివారైతే.. లక్ కలిసివస్తుంది’ అనే పాత సామెతను మన టాలీవుడ్ స్టార్స్ ప్రస్తుత హిట్స్ మరియు కంబ్యాక్స్తో మరోసారి ప్రూవ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
LPG Subsidy: మీకు ఎల్పీజీ సబ్సిడీ రావడం లేదా..? అయితే రేపటి లోగా ఇలా చేయండి..
-
YouTuber Nandu : నేను బిగ్ బాస్ కోసం రాలేదు.. కుట్ర జరిగింది, అసలు దోషులు వేరే ఉన్నారు!
-
INDIA Bloc: ‘‘ఓట్ చోరీ’’పై ఇండీ కూటమి యాక్షన్ ప్లాన్..
-
Central Cabinet Decision: అన్నదాతలకు గుడ్‌న్యూస్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!