Site icon NTV Telugu

Bihar: నేడు నితీష్ ప్రమాణ స్వీకారం.. మరోవైపు బీజేపీ ఆందోళన

Nitish Kumar

Nitish Kumar

Nitish Kumar will take oath as Chief Minister of Bihar today: బీహార్ రాష్ట్రంలో మరోసారి నితీష్ కుమార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. బీజేపీతో బంధాన్ని తెంచుకున్న నితీష్ కుమార్ మరోసారి ఆర్జేడీతో జట్టు కట్టబోతున్నారు. బుధవారం రోజు మధ్యాహ్నం 2 గంటలకు 8వసారి నితీష్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఉప ముఖ్యమంత్రిగా లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజస్వీ యాదవ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నిన్న గవర్నర్ ను కలిసిన నితీష్ కుమార్.. తనకు ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాల ఎమ్మెల్యే మద్దతు ఉందని.. అందుకు సంబంధించిన 164 మంది ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్ ఫాగు చౌహాన్ కు అందించారు.

Read Also: Attack on Student: నల్గొండలో దారుణం.. యువతిపై ప్రమోన్మాది కత్తితో దాడి

నిన్న తేజస్వీ యాదవ్ ఇంట్లో ఇఫ్తార్ విందుకు హాజరైన నితీష్.. గతంలో ఆర్జేడీతో బంధాన్ని తెంచుకున్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ‘ క్షమించమని’ కోరినట్లు సమాచారం. జరిగిన పరిణామాలన్నింటికి బీజేపీ, అమిత్ షానే కారణం అని నితీష్ కుమార్ భావిస్తున్నారు. మహారాష్ట్ర తరహాలోనే బీహార్ లో బీజేపీ కుట్ర చేస్తుందని భావించిన నితీష్ కుమార్ బీజేపీతో తెగదెంపులు చేసుకున్నారు. ఇదిలా ఉంటే బీహార్ చర్యలను బీజేపీ నిశితంగా పరిశీలిస్తోంది. ఇప్పటికే బీజేపీ నేతలు రవిశంకర్ ప్రసాద్, సుశీల్ కుమార్ మోదీలు బీహార్ వెళ్లారు. మరోవైపు ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. ప్రజలు ఇచ్చిన తీర్పుకు నితీష్ ద్రోహం చేశారని.. ఇది ఆయన సహజ లక్షణం అని బీజేపీ విమర్శిస్తోంది. అధికారం కోసం సిద్ధాంతాలు తాకట్టు పెట్టే వ్యక్తి నితీష్ అంటూ తీవ్ర విమర్శలు చేస్తోంది.

మరోవైపు కూటమి పొత్తుపై ఇప్పటికే ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ పార్టీలు అవగాహనకు వచ్చాయి. ప్రభతు్వంలో మంత్రి పదవుల గురించి అవగాహన కుదుర్చుకున్నాయి. రాష్ట్రీ జనతా దళ్ ( ఆర్జేడీ)కి 16 మంత్రి పదవులు, జనతా దళ్ యునైటెడ్(జేడీయూ)కు 13 మంత్రి పదవులు, కాంగ్రెస్ పార్టీకి 4, హిందూస్థాని అవామ్ మోర్చాకు ఒక మంత్రి పదవి దక్కనుంది.

Exit mobile version