Site icon NTV Telugu

Nitin Nabin: బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్ నబిన్.. ఎవరు ఈయన..

Bihar Minister Nitin Nabin

Bihar Minister Nitin Nabin

Nitin Nabin: బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బీహార్ మంత్రి నితిన్ నబిన్‌ను నియమిస్తున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. ఈ నియామకం తక్షణమే అమలులోకి వస్తుందని తెలిపింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ జారీ చేసిన అధికారిక ఉత్తర్వులో ఈ నియామకానికి పార్టీ పార్లమెంటరీ బోర్డు ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. నబిన్ ప్రస్తుతం, బీహార్‌లో నితీష్ కుమాన్ నేతృత్వంలోని ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్నారు. ఆయన రహదారుల నిర్మాణ శాఖను చూస్తున్నారు.

Read Also: Tilak Varma Dating: క్యూట్ క్రికెటర్‌తో తిలక్ వర్మ డేటింగ్‌..!

నితిన్ నబిన్ ఎవరు?

బీహార్ బీజేపీలో సీనియర్ నేతగా నితిన్ నబిన్ ఉన్నారు. పాట్నాలో జన్మించిన ఈయన సీనియర్ బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే దివంగత నబిన్ కిషోర్ ప్రసాద్ సిన్హా కుమారుడు. తండ్రి మరణాంతరం నితిన్ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. పాట్నాలోని బాంకిపూర్ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. 2006 ఉప ఎన్నికలో విజయం సాధించినప్పటి నుండి, నవీన్ 2010, 2015, 2020, 2025 అసెంబ్లీ ఎన్నికలలో వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన బీహార్ ఎన్నికల్లో బాంకిపూర్‌ నుంచి 51,000 ఓట్ల మెజారిటీతో భారీ విజయం సాధించారు.

Exit mobile version