Bihar: రామచరిత్ మానస్ మరోసారి వివాదాల్లోకి వచ్చింది. తాజాగా బీహార్ మంత్రి కూడా హిందూ గ్రంథాలపై ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. పవిత్ర రామచరితమానస్ గ్రంథాన్ని విషపదార్థమైన ‘సైనైడ్’తో పోల్చాడు. ఆయన వ్యాఖ్యలపై ఇప్పుడు పొలిటికల్ దుమారం ప్రారంభమైంది. హిందీ దివాస్ సందర్భంగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ బీహార్ మంత్రి చంద్రశేఖర్ బుధవారం ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘మీకు 50 రకాల వంటకాలను వడ్డించి అందులో పొటాషియ సైనైడ్ కలిపితే మీరు తింటారా..? హిందూ మత గ్రంథాలది కూడా ఇదే పరిస్థితి’’ అని ఆయన అన్నారు. రామచరితమానస్ పట్ల నా అభ్యంతరం కూడా ధృడమైందని, ఇది నా జీవితాంతం కొనసాగుందని, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా దీన్ని వ్యాఖ్యానించారని ఆయన అన్నారు.
Read Also: Pakistan: పీఓకేలో ఉగ్రవాదులకు పాక్ సాయం.. చైనా ఆయుధాలను అందిస్తున్న ఐఎస్ఐ
కులాల ప్రస్తావన ఉన్నంత కాలం దేశంలో రిజర్వేషన్లు, కుల గణన జరగాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. మంత్రి వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్ అవుతోంది. సీఎం నితీష్ కుమార్ ని టార్గెట్ చేస్తోంది. బీజేపీ అధికార ప్రతినిధి నీరజ్ కుమార్ మాట్లాడుతూ.. మంత్రి చంద్రశేఖర్ నిరంతరం రామచరితమానస్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని, నితీష్ కుమార్ కి వినబడటం లేదా..? అని ప్రశ్నించారు.నితీష్ కుమార్ సనానాన్ని నిరంతరం అవమానిస్తున్నారని విమర్శించారు. చంద్రశేఖర్ కి ఏమైనా ఇబ్బంది ఉంటే మతం మార్చుకోవాాలని సూచించారు.
రామచరితమానస్ పై మంత్రి చంద్రశేఖర్ వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. ఆర్జేడీ పార్టీ కీలక నేత, మంత్రిగా ఉన్న ఈయన రామచరితమానస్ సమాజంలో ద్వేషాన్ని వ్యాప్తి చేస్తోందని అన్నారు. ప్రేమ, ఆప్యాయతతో దేశం గొప్పది అవుతుంది కానీ రామచరితమానస్, మనుస్మృతి బంచ్ ఆఫ్ థాట్స్ వంటి పుస్తకాలతో కాదని, ఇవి ద్వేషం, సామాజిక విభజన బీజాలను నాటుతాయని అన్నారు. దళితులు, వెనకబడినవారు, మహిళల్ని విద్యకు దూరం చేస్తాయని అన్నారు.