NTV Telugu Site icon

Kuwait Fire Accident: వచ్చే నెలలో వివాహం.. కొడుకు మిస్సింగ్.. ఓ తల్లి ఆవేదన..

Kuwait Fire

Kuwait Fire

Kuwait Fire Accident: బతువుదెరువు కోపం పరాయి దేశం వెళ్లి, శవాలుగా తిరిగి వస్తున్న తమ వారిని చూస్తున్న కుటుంబాల కన్నీరును ఆపడం ఎవరి వల్ల కావడం లేదు. తమవారిని కాలిన మృతదేహాలుగా చూస్తామనుకోలేదని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గల్ఫ్ దేశం కువైట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 45 మంది భారతీయులు మరణించడం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ముఖ్యంగా మృతుల్లో సగానికి కన్నా ఎక్కువ మంది కేరళకి చెందిన వారే ఉన్నారు. ఐఏఎఫ్ విమానంలో మరణించిన వారి మృతదేహాలను కొచ్చిన్ తీసుకువచ్చారు. శుక్రవారం తెల్లవారుజామున బయలుదేరిని విమానం ఉదయం 10.30 గంటలకు కొచ్చిన్ చేరుకుంది.

Read Also: T20 World Cup 2024: ఉన్నపళంగా స్వదేశానికి ఇద్దరు భారత ఆటగాళ్లు.. కారణం ఏంటంటే?

ఇదిలా ఉంటే ఈ అగ్నిప్రమాదం జరిగినప్పటి నుంచి తన కొడుకు అదృశ్యమయ్యాడని ఓ తల్లి ఆందోళన చెందుతోంది. వచ్చే నెలలో వివాహం కావాల్సిన తన కొడుకు సమాచారం కోసం ఎదురుచూస్తోంది. బీహార్ ‌కి చెందిన మదీనా ఖాతూన్ అనే మహిళ, తన పెద్ద కుమారుడు కాలూ ఖాన్ అగ్నిప్రమాదం జరిగిన భవనంలోనే నివసిస్తున్నాడని చెప్పారు. ‘‘మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో నేను అతనితో ఫోన్‌లో మాట్లాడాను. వచ్చే నెలలో తన వివాహం జరగాల్సి ఉన్నందున జూలై 5న దర్భంగా వస్తానని చెప్పాడు’’ అని విలపించింది. బీహార్‌లోని దర్భంగా జిల్లాలోని నైనా ఘాట్ ప్రాంతానికి చెందిన ఖాతూన్, తన కుమారుడు కొన్నేళ్లుగా కువైట్‌లో నివసిస్తున్నాడని చెప్పారు.

కాలూ ఖాన్ స్కిల్ లేబర్‌గా గత కొన్ని ఏళ్లుగా కువైట్‌లో నివసిస్తున్నాడు. తన కుమారుడు ఉన్న భవనంలోనే అగ్నిప్రమాదం జరిగిందని అతని తల్లి పేర్కొంది. తాను కాల్ చేసినప్పటికీ స్పందన లేదని, కొడుకు గురించి ఎలాంటి సమాచారం అందలేదని, తన కుమారుడికి ఏం జరిగిందో తెలియడం లేదని చెప్పింది. ఈ విషయంలో అధికారులను సంప్రదించేందుకు ప్రయత్నించాం, కానీ మా ప్రయత్నం ఫలించలేదని చెప్పింది. నా కొడుకు క్షేమం కోసం దేవుడిని ప్రార్థిస్తున్నట్లు వెల్లడించారు.