Site icon NTV Telugu

Bihar Election: నేడు ఇండియా కూటమి మేనిఫెస్టో విడుదల.. ప్రధాన హామీ ఇదే!

Bihar Election

Bihar Election

బీహార్‌లో తొలి దశ అసెంబ్లీ ఎన్నికలకు ఇక వారం రోజులే మిగిలుంది. ఇంకోవైపు రాష్ట్రంలో ఛత్ పండుగ సందడి సాగుతోంది. రాష్ట్రమంతా కోలాహలంగా ఉంది. ఈరోజుతో ఛత్ పండుగ ముగియనుంది. ఇక ఓట్ల పండుగ ప్రారంభం కానుంది. బీహారీయులు తిరిగి పనుల నిమిత్తం బయట రాష్ట్రాలకు వెళ్లిపోకుండా పార్టీలు పక్కా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేయాలని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. అన్ని పార్టీలు ర్యాలీలు, బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Trump: ట్రంప్ మరోసారి సంచలన ప్రకటన.. మూడోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని వెల్లడి

ఇదిలా ఉంటే మంగళవారం మహాఘటబంధన్ మేనిఫెస్టో విడుదల కానుంది. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పాట్నాలో మేనిఫెస్టో విడుదల చేసి అనంతరం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. బీహార్ అంతటా ర్యాలీలు, బహిరంగ సమావేశాలను ప్రారంభించనున్నారు.

ఇది కూడా చదవండి: Cyclone Montha: 10 జిల్లాలపై మొంథా తుఫాన్‌ తీవ్ర ప్రభావం.. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరికలు..

ఇక మేనిఫెస్టోలో ప్రధానంగా ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం అనే హామీ ఉండొచ్చని తెలుస్తోంది. ఇటీవలే ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ప్రకటించారు. ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం సాధ్యమేనని తెలిపారు. ఈ నేపథ్యంలో మేనిఫెస్టోలో ఈ హామీ ఉండొచ్చని సమాచారం. అలాగే వృద్ధాప్య పింఛన్‌ను కూడా పెంచొచ్చని తెలుస్తోంది. అంతేకాకుండా జీవికా దీదీలను పర్మినెంట్ చేసి రూ.30,000 జీతం ఇవ్వనున్నారు. యువత, మహిళలను ఆకట్టుకునేలా హామీల వర్షం కురిపించొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు రెండు విడతలుగా జరగనున్నాయి. నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 14న విడుదల కానున్నాయి. ప్రధానంగా ఇండియా కూటమి-ఎన్డీఏ కూటమి మధ్య పోటీ నెలకొంది.

ఇదిలా ఉంటే ఎన్నికల వేళ ఆర్జేడీ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్న 27 మంది నాయకులను ఆర్జేడీ బహిష్కరించింది. ఇందులో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఉండడం విశేషం.

Exit mobile version