Site icon NTV Telugu

Bihar Elections: బీహార్ ఇండియా కూటమి సీఎం అభ్యర్థి ప్రకటన.. ఎవరంటే..!

Tejashwi Yadav2

Tejashwi Yadav2

మొత్తానికి ఇండియా కూటమిలో నెలకొన్న రాజకీయ సంక్షోభం సమిసిపోయింది. విభేదాలు పక్కన పెట్టి ఐక్యతా రాగం పలికాయి. తాజాగా బీహార్ మహాఘట్‌బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్ పేరును అధికారికంగా ఇండియా కూటమి పార్టీలు సంయుక్త ప్రెస్‌మీట్ నిర్వహించి ప్రకటించాయి. తేజస్వి యాదవ్‌తో కలిసి అశోక్‌ గెహ్లోట్ విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తేజస్వి యాదవ్ పేరును అధికారికంగా వెల్లడించారు. ఇక డిప్యూటీ సీఎం అభ్యర్థిగా వికాస్‌షీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) చీఫ్ ముఖేష్ సహానీని ప్రకటించారు.

బీహార్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందు వరకు ఇండియా కూటమి ఏకంగానే ఉంది. అయితే సీట్ల పంపకాల విషయంలో తేడా రావడంతో చివరి నిమిషంలో ఎవరి దారి వారిదే అన్నట్టుగా విడివిడిగా నామినేషన్లు వేశారు. దీంతో అధికారంలోకి వద్దామనుకున్న కూటమి ఆశలు గల్లంతయ్యాయి. మరోవైపు విపక్ష కూటమి బలహీనతను అధికార కూటమి క్యాష్ చేసుకుంటోంది. మరోసారి అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ప్రణాళికలు వేసుకుంటోంది. దీంతో కాంగ్రెస్ అప్రమత్తం అయింది. సీనియర్ నాయకుడు. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ను రంగంలోకి దింపింది. అంతే హుటాహుటినా అశోక్ గెహ్లాట్ పాట్నాలో వాలిపోయారు. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఇంట్లో ఇండియా కూటమి పార్టీలతో చర్చలు జరిపారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్‌ను ఏక కంఠంతో అంగీకారం తెలిపాయి. దీంతో కూటమిలో నెలకొన్న సంక్షోభం ఒక్కసారిగా పటాపంచలు అయింది. గురువారం అధికారికంగా తేజస్వి యాదవ్ పేరును ప్రకటించారు.

ఇక ఎన్నికల్లో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కీలక హామీలు కుమ్మరించారు. ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. అలాగే జీవికా దీదీలకు నెలకు రూ.30,000 జీతం ఇస్తామని వెల్లడించారు. పర్మినెంట్ చేయడంతో పాటు రుణాలు కూడా ఇస్తామని తెలిపారు.

బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 14న విడుదల కానున్నాయి.

ఇది కూడా చదవండి: Modi vs Congress: ట్రంప్‌ను కలవలేకే సదస్సుకు మోడీ దూరం.. కాంగ్రెస్ విమర్శ

 

Exit mobile version