Site icon NTV Telugu

Bihar Elections: బీహార్ ఎన్నికల్లో కీలక ఘట్టం పూర్తి.. ముగిసిన నామినేషన్ల ప్రక్రియ..

Bihar Elections

Bihar Elections

Bihar Elections: బీహార్ ఎన్నికల్లో కీలక ఘట్టం ముగిసింది. మొదటి విడత ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. రాష్ట్రంలోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు గానూ తొలి విడతలో 121 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. కౌంటింగ్ నవంబర్ 14న జరుగుతుంది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల పర్వం ముగిసింది. రేపటి నుంచి నామినేషన్ల పరిశీలన ఉంది. ఈ నెల 20 వరకు నామినేషన్ల విత్ డ్రాకు సమయం ఉంది. 121 స్థానాల్లో సుమారుగా 5 స్థానాల్లో మహాఘట్ బంధన్ భాగస్వామ్య పక్షాల పరస్పర పోరు నెలకొంది. శరద్ యాదవ్ కకుమారుడు శాంతనకు మాధేపూర నుంచి టికెట్ ఇచ్చేందకు ఆర్జేడీ నిరాకరించింది. తేజస్వీ యాదవ్ మాట తప్పారని శరద్ యాదవ్ కుమార్తె సుభాషిని విమర్శించింది.

Read Also: Zepto Funding: రూ.4 వేల కోట్లు సేకరించిన జెప్టో.. ఇంతకీ కంపెనీ మొత్తం విలువ ఎంతో తెలుసా..

బీహార్ ఎన్నికల్లో అధికార బీజేపీ , జేడీయూ, చిరాగ్ పాశ్వాన్‌ల ఎల్జేపీ పార్టీలు ఎన్డీయే కూటమికి, ఆర్జేడీ-కాంగ్రెస్ కూటములకు మధ్య పోటీ నెలకొంది. తొలి విడతలో 24 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తోంది. ఇదిలా ఉంటే, ఆర్జేడీ పోటీ చేసే స్థానాలపై ఇప్పటికీ అస్పష్టత నెలకొంది. అధికారికంగా ప్రకటించకుండానే అభ్యర్థులకు ఎన్నికల గుర్తును ఆర్జేడీ కేటాయించింది. ఇక ఎన్డీయే కూటమి అభ్యర్థుల ప్రకటనపై క్లారిటీలో ఉంది. దీంతో ప్రచారం, ఎన్నికల సన్నాహాల్లో ఎన్డీయే అభ్యర్థులు నిమగ్నమై ఉన్నారు. ఎన్డీయే నేతల్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమన్వయ పరుస్తున్నారు.

Exit mobile version