BJP: రాబోయే బీహార్ ఎన్నికల్లో బురఖా ధరించిన ఓటర్లను చెక్ చేయాలని బీహార్ బీజేపీ చీఫ్ దిలీప్ జైస్వాల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. బీజేపీ ద్వేషపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని ఆర్జేడీ ఆరోపించింది. పోలింగ్ బూతుల్లో బురఖా ధరించిన మహిళల్ని ధ్రువీకరించాలని నిన్న ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌తో జరిగిన సమావేశంలో బిజెపి చీఫ్ జైస్వాల్ కోరారు. నిజమైన ఓటర్ల మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఓటర్ల సంఖ్య, ముఖ్యంగా బురఖా ధరించిన మహిళ ముఖాలను ఓటర్ ఐటీతో నిర్ధారించాలి అని ఆయన అన్నారు
Read Also: Vijayawada Horror: విజయవాడలో దారుణం: వృద్ధురాలిని ముక్కలు ముక్కలుగా నరికిన అక్క కొడుకు
ఈ వ్యాఖ్యలపై ప్రధాన ప్రతిపక్ష ఆర్జేడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది రాజకీయ కుట్ర అని, ఓటర్ల జాబితాలో ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ జరిగిందని, కొత్త ఫోటో గ్రాఫ్ లతో అందరు ఓటర్లకు ఎపిక్ కార్డులు జారీ చేశారని, అయినప్పటికీ బీజేపీ తన సొంత ఎజెండాను ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదిలా ఉంటే, బీహార్ డిప్యూటీ సీఎం విజయ్ సిన్హా మాత్రం బురఖా ధరించిన ఓటర్లను ఉద్యోగులు ధ్రువీకరించాలనే డిమాండ్‌ను సమర్థించారు. మహిళా అధికారులు, మహిళా ఓటర్లు ముఖాలను చూస్తే తప్పేంటని ప్రశ్నించారు.
