Bihar: షాకింగ్ నిర్ణయం.. బంకీపూర్ అభ్యర్థిని మార్చేసిన బీజేపీ.. కారణమిదేనా?
- బంకీపూర్ బైపోల్లో రసవత్తర పోరు
- బంకీపూర్ అభ్యర్థిని మార్చేసిన బీజేపీ
- జాతీయంగా తీవ్ర చర్చగా మారిన వ్యవహారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్‌లో రసవత్తర పోరు జరుగుతోంది. బంకీపూర్ బైపోల్ ఎలక్షన్ రెండు పార్టీల మధ్య నువ్వానేనా? అన్నట్టుగా మారింది. దీనికి ప్రధాన కారణం.. ఇక్కడ జన్ సురాజ్ పార్టీ అధినేత, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పోటీ చేయడమే కారణమా? ప్రస్తుతం జాతీయంగా ప్రత్యేక చర్చ సాగుతోంది.
అయితే తాజాగా బీజేపీ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. చివరి నిమిషంలో అనూహ్యంగా అభ్యర్థిని మార్చేసింది. మొదట ప్రకటించిన అభ్యర్థి అభిషేక్ కుమార్ సిన్హా నామినేషన్ దాఖలు చేసిన మరుసటి రోజే పోటీ నుంచి తప్పు్కున్నాడు. ఆయన స్థానంలో నీరజ్ కుమార్ సిన్హాను అభ్యర్థిగా ప్రకటించింది. ఈ నిర్ణయం వెనుక కుటుంబ కారణాలేనా? లేక అంతర్గత రాజకీయాలు, ప్రశాంత్ కిషోర్ ఒత్తిడి లేదా పశుగ్రాసం (ఫోడర్) కుంభకోణం ప్రభావమా? అనే చర్చ మొదలైంది.
Also Read
- Karnataka Cabinet Expansion 2026: కర్ణాటకలో నేడు మంత్రివర్గ విస్తరణ.. 20 మంది కొత్త మంత్రుల జాబితా విడుదల
- KTR: ప్రచార హామీలు మరిచారా.? జాబ్ క్యాలెండర్ ఎక్కడంటూ ప్రభుత్వంపై ఫైర్.!
- Brij Bhushan Sharan Singh: మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసు.. బ్రిజ్ భూషణ్ సింగ్‌ను నిర్దోషిగా తేల్చిన కోర్టు
- Sangareddy: చిట్టీల పేరుతో భారీ మోసం.. రూ.3 కోట్లతో భార్యాభర్తలు పరార్.!
ఈనెల 30న జరగనున్న బంకీపూర్ ఉపఎన్నికకు అభిషేక్ కుమార్ సిన్హా బీజేపీ తరఫున నామినేషన్ దాఖలు చేశారు. అదే రోజు బీహార్ ఉప ముఖ్యమంత్రి సమ్రాట్ చౌధరి ఆయనకు మద్దతుగా ప్రచారం కూడా నిర్వహించారు. అయితే మరుసటి రోజే అభిషేక్ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ‘‘బీజేపీ నాపై నమ్మకం ఉంచి అభ్యర్థిగా ప్రకటించింది. కానీ కుటుంబ కారణాల వల్ల ఎన్నికల్లో పోటీ చేయడం సాధ్యం కావడం లేదు. పార్టీ కార్యకర్తగా కొనసాగుతూ పార్టీ కోసం పనిచేస్తాను.’’ అని అభిషేక్ వెల్లడించారు. దీంతో అంతా షాక్ అయ్యారు.
కొత్త అభ్యర్థిగా నీరజ్ కుమార్ సిన్హా
అభిషేక్ వైదొలగిన అనంతరం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ 32 ఏళ్ల నీరజ్ కుమార్ సిన్హాను అభ్యర్థిగా ప్రకటించింది. 2006 నుంచి బీజేపీలో పనిచేస్తున్న నీరజ్ కుమార్ సిన్హా బూత్ అధ్యక్షుడిగా, భారతీయ జనతా యువ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడిగా సేవలందించారు. అభ్యర్థిత్వం ప్రకటించడంతో పార్టీ అగ్రనేతలకు కృతజ్ఞతలు తెలుపుతూ భారీ మెజారిటీతో విజయం సాధిస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు.
బీజేపీ అధికారికంగా కుటుంబ కారణాల వల్లే అభిషేక్ పోటీ నుంచి తప్పుకున్నారని చెబుతున్నప్పటికీ.. రాజకీయ విశ్లేషకులు మాత్రం ఇతర కారణాలను ప్రస్తావిస్తున్నారు. సీనియర్ జర్నలిస్టు కన్హయ్యా భేలారి ప్రకారం.. అభిషేక్ కుమార్ సిన్హా.. నితిన్ నవీన్‌కు అత్యంత సన్నిహితుడు. ఆయననే అభ్యర్థిగా ఎంపిక చేయాలని నితిన్ నవీన్ సూచించారని, అనంతరం అభిషేక్ కుటుంబ నేపథ్యంపై పార్టీలో అభ్యంతరాలు వ్యక్తమవడంతో అంతర్గత విభేదాలు బయటపడ్డాయని తెలిపారు.
మరో సీనియర్ జర్నలిస్టు లవ్ కుమార్ మిశ్రా ప్రకారం.. అభిషేక్ కుమార్ సిన్హా తల్లిదండ్రులు గతంలో పశుగ్రాసం (ఫోడర్) కుంభకోణం కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు ద్వారా దోషులుగా తేలారు. ఆ కుంభకోణాన్ని బీజేపీ ఎప్పటి నుంచో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌పై ప్రధాన రాజకీయ ఆయుధంగా ఉపయోగిస్తోంది. అలాంటి సమయంలో అదే కేసుతో సంబంధం ఉన్న కుటుంబానికి చెందిన వ్యక్తిని అభ్యర్థిగా కొనసాగించడం పార్టీకి రాజకీయంగా ఇబ్బందిగా మారుతుందని భావించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
అయితే బీజేపీ వర్గాల సమాచారం ప్రకారం.. జన్ సురాజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల ప్రచారంలో ఈ అంశాన్ని పదేపదే లేవనెత్తే అవకాశం ఉందనే ఆందోళన కూడా పార్టీకి ఉన్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ కిషోర్ బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తూ.. ‘‘ఇతర పార్టీల అభ్యర్థులను సీబీఐ, ఈడీతో బెదిరించే బీజేపీకి ఇప్పుడు అదే పరిస్థితి ఎదురైంది. ప్రజలు చైతన్యవంతమవడంతో వారి అభ్యర్థే మొదటి పోరాటంలో పారిపోయాడు.’’అని వ్యాఖ్యానించారు. అలాగే ‘‘ఇది బీజేపీ అవినీతిపరులకే టికెట్లు ఇస్తుందనే విషయాన్ని స్వయంగా ఒప్పుకున్నట్టే.’’ అని ఆరోపించారు.
బీజేపీ వివరణ
ఈ వివాదంపై స్పందించిన బీహార్ బీజేపీ అధ్యక్షుడు సంజయ్ సరావోగి.. అభిషేక్ కుమార్ సిన్హా స్వయంగా కుటుంబ కారణాలతో పోటీ చేయలేనని లేఖ రాశారని తెలిపారు. ఆ తర్వాతే పార్టీ కేంద్ర నాయకత్వం, ఎన్నికల కమిటీ కలిసి బూత్ స్థాయి నుంచి పనిచేసిన నీరజ్ సిన్హాను అభ్యర్థిగా ఎంపిక చేశాయని చెప్పారు. ‘‘బీజేపీలో సాధారణ కార్యకర్తకూ అభ్యర్థిత్వం దక్కే అవకాశం ఉంటుంది. నీరజ్ సిన్హా బాంకీపూర్కు అంకితభావంతో పనిచేసిన కార్యకర్త.’’ అని ఆయన పేర్కొన్నారు.
బాంకీపూర్ ఉపఎన్నిక ఎందుకు కీలకం?
రాజ్యసభకు ఎన్నికైన బీజేపీ నేత నితిన్ నవీన్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఈ ఉపఎన్నిక అవసరమైంది. 1995 నుంచి బాంకీపూర్ బీజేపీకి కంచుకోటగా ఉంది. నితిన్ నవీన్ తండ్రి నవీన్ కిశోర్ సిన్హా గెలిచినప్పటి నుంచి ఈ నియోజకవర్గంలో బీజేపీ వరుస విజయాలు సాధిస్తోంది. అయితే ఈసారి పోటీ అంత సులభం కాదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఆర్జేడీ తరఫున రేఖా గుప్తా బరిలో ఉండగా.. జన్ సురాజ్ అధినేత ప్రశాంత్ కిషోర్ కూడా ఈ ఉపఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో బాంకీపూర్ ఉపఎన్నికకు రాష్ట్రవ్యాప్తంగా మాత్రమే కాకుండా జాతీయ స్థాయిలో కూడా ప్రాధాన్యం ఏర్పడింది.
- Tags
- Bankipur
- Bankipur bypoll
- bihar
- bjp
తాజావార్తలు
-
Sai Krishna Custodial Death: సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు.. సిట్ దర్యాప్తు ముమ్మరం!
-
Rakhi Sawant: నేను ముస్లింనో కాదో నిర్ణయించడానికి మీరెవరు?.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన రాఖీ సావంత్ ..
-
Team India-BCCI: టీమిండియాలో పెరుగుతున్న గాయాల బెడద.. బీసీసీఐ కీలక నిర్ణయం!
-
Karthi New Movie: కార్తికి మరో భారీ ప్రాజెక్ట్.. స్టార్ డైరెక్టర్‌తో ఫస్ట్ టైమ్ .. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా కొత్త సినిమా!
-
Kia Sorento: కియా సోరెంటో ఎస్యూవీ కొత్త టీజర్ విడుదల.. ప్రీ-బుకింగ్‌లు ప్రారంభం, లాంచ్‌కు సిద్ధమైన కియా
ట్రెండింగ్
-
Mushroom Onion Pakoda: ఈజీ స్నాక్ రెసిపీ..10 నిమిషాల్లో కరకరలాడే ‘మష్రూమ్ ఆనియన్ పకోడీ’.! చేసేయండి ఇలా..
-
Mumbai Indians Captain: ముగ్గురు దిగ్గజాల సపోర్ట్.. తెలుగు ఆటగాడికి ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ!
-
ప్రీమియం ఫీచర్లు బడ్జెట్ ధరలో.. 50MP OIS కెమెరా, సూపర్ AMOLED డిస్ప్లేతో Samsung Galaxy F70 Pro 5G లాంచ్..!
-
Best Cricketing Brain: ఎంఎస్ ధోనీ కాదు, అతడే బెస్ట్ క్రికెటింగ్ బ్రెయిన్.. ఆ టీమిండియా మాజీ స్టార్ ఎవరంటే?
-
Tata దూకుడు మాములుగా లేదుగా.. Nexon నుంచి ప్రీమియం Avinya X వరకు భారీ ప్లాన్..!