Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Bihar Assembly Passes Bill To Increase Caste Quota To 65

Bihar: 50 నుంచి 65 శాతానికి రిజర్వేషన్లు.. బిల్లును ఆమోదించిన అసెంబ్లీ..

Published Date :November 9, 2023 , 3:53 pm
By Venu Goapl Reddy
Bihar: 50 నుంచి 65 శాతానికి రిజర్వేషన్లు.. బిల్లును ఆమోదించిన అసెంబ్లీ..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Bihar: సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని బీహార్ సర్కార్ కీలక రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. బీహార్‌లోని ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో రిజర్వేషన్ల పెంపుదల కోరుతూ రూపొందించిన ‘రిజర్వేషన్ సవరణ బిల్లు’ను ఈరోజు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది. రాష్ట్రంలోని ఇతర వెనకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల కోటాను పెంచే బిల్లుకు మంగళవారం బీహార్ కేబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది.

ఈ రోజు సీఎం నితీష్ కుమార్ హాజరు కాకుండానే రాష్ట్ర అసెంబ్లీ ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ బిల్లు రాష్ట్రంలో రిజర్వేషన్ల కోటాను 50 శాతం నుంచి 65 శాతానికి పెంచుతుంది. ఆర్థికంగా వెనబడిన వర్గాల కోటా(ఈడబ్ల్యూఎస్) కోసం కేంద్రం 10 శాతం కోటాను కలుపుకుంటే మొత్తం రిజర్వేషన్లు 75 శాతానికి పెరుగుతాయి.

Also Read

  • Raghav Chadha: ఆప్‌కు రాఘవ్ చద్దా భారీ షాక్.. ఏకంగా ఏడుగురు ఎంపీలు బీజేపీలోకి..
  • IRS Officer Daughter Murder: బాధితురాలిని నిందితుడి ఏమని పిలిచేవాడంటే..! పోలీసుల రిపోర్ట్‌లో సంచలన విషయాలు
  • PM Modi: మే 4న అటవిక పాలనకు డెత్‌ డే.. టీఎంసీ గూండాలను తరిమికొడతామన్న మోడీ
  • Monsoon Season: రుతుపవనాల రాకపై తీపికబురు.. ఎంట్రీ ఇచ్చేది ఎప్పుడంటే..!

Read Also: 1000 years old treasure: బయటపడ్డ 1000 ఏళ్ల నాటి నిధి.. ఎక్కడో తెలుసా..?

ఈ బిల్లు ప్రకారం చూసుకుంటే.. ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 2 శాతం, ఓబీసీ, బీసీలకు కలిపి 43 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. ప్రస్తుతం బీహార్ రాష్ట్ర ఉద్యోగాల్లో, విద్యాసంస్థల్లో ఈబీసీలకు 18, ఓబీసీలకు 12 శాతం, ఎస్సీలకు 16 శాతం, ఎస్టీలకు 1 శాతం, వెనకబడిన తరగతుల మహిళలకు 3 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. అయితే రిజర్వేషన్ల విభజన బిల్లులో ఈడబ్ల్యూఎస్‌ని ప్రస్తావించకపోవడంపై బీజేపీ విమర్శిస్తోంది.

కులాల సర్వేలో బీహార్ ప్రభుత్వం కావాలనే యాదవులు, ముస్లింల జనాభాను పెంచిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. అయితే బీజేపీ విమర్శలను సీఎం నితీష్ కుమార్ తిప్పికొట్టారు. తొమ్మిది పార్టీల మద్దతుతో కుల ప్రాతిపదికన జనాభా గణన జరిగింది, ప్రతీ ఒక్కరి ఆర్థిక పరిస్థితి పరిశీలించామని, ఈ విషయాన్ని ఇప్పటికే సభలో చెప్పాము, దీనిపై ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాంటూ బీజేపీని ప్రశ్నించారు. తక్షణమే ఈ బిల్లును అమలు చేయాలని ముఖ్యమంత్రి కోరారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bihar
  • bjp
  • CM Nitish Kumar
  • JDU
  • Reservation Amendment Bill

తాజావార్తలు

  • Praful Hinge: వైభవ్ సూర్యవంశీ బలహీనతను ఎక్స్‌పోజ్ చేసిన ప్రఫుల్ హింజ్..

  • Cockroaches and Ants: ఎలాంటి కెమికల్స్‌, స్ప్రే లేవు.. ఈ చిట్కాతో ఇంట్లో బొద్దింకలు, చీమలు మాయం.. మళ్లీ వస్తే అడగండి..!

  • Mutual Funds: ఓ వైపు స్టాక్ మార్కెట్ పడిపోతున్నా.. విపరీతంగా పెరుగుతున్న SIP ఖాతాలు..

  • Raghav Chadha: ఆప్‌కు రాఘవ్ చద్దా భారీ షాక్.. ఏకంగా ఏడుగురు ఎంపీలు బీజేపీలోకి..

  • Sensex Crash: కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ! దలాల్ స్ట్రీట్‌లో ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు లాస్..

ట్రెండింగ్‌

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions