Site icon NTV Telugu

Amit Shah: కాసేపట్లో తమిళనాడుకు అమిత్ షా.. కొత్త బీజేపీ చీఫ్ పేరు ప్రకటించే ఛాన్స్!

Amith Shah

Amith Shah

Amit Shah: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కాసేపట్లో తమిళనాడు పర్యటనకు వెళ్లనున్నారు. ఇక, ఈ సందర్భంగా రాష్ట్రంలో తర్వలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నారు. అయితే, గత నెలలో AIDMK ప్రధాన కార్యదర్శి కె పళనిస్వామి (ఈపీఎస్), అమిత్ షా మధ్య కీలక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రస్తుత బీజేపీ చీఫ్ అన్నామలైను తొలగిస్తేనే.. తమిళనాడులో ఇరు పార్టీల మధ్య పొత్తు కుదురుతుందని పళనిస్వామి తేల్చి చెప్పారు. దీంతో రాష్ట్ర కమలం పార్టీలో గందరగోళం నెలకొంది.

Read Also: Stock Market: కలిసొచ్చిన ట్రంప్ నిర్ణయం.. భారీ లాభాల్లో సూచీలు

ఇక, ఈ నేపథ్యంలో ఇప్పటికే, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్లు ప్రారంభమైయ్యాయి. అందులో భాగంగానే, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెన్నైలోని ఒక ప్రైవేట్ హోటల్‌లో పార్టీ సీనియర్ నేతలతో కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త ఎస్ గురుమూర్తితోనూ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. అనంతరం తమిళనాడులోని రెండు దేవాలయాలను అమిత్ షా సందర్శించనున్నారు. అయితే, ఈ పర్యటన ముగిసిన తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి షా పెద్ద ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Read Also: Tahawwur Rana: ఎన్ఐఏ కస్టడీలో తహవూర్ రాణా.. నేడు ఈ అంశాలపై ప్రశ్నలు

అయితే, అన్నాడీఎంకే పార్టీలో అంతర్గత చీలికతో వీకే శశికళను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు రాజకీయాలకు రజనీకాంత్ దూరం కావడంతో మరోసారి తమిళనాడు రాష్ట్ర పాలిటికిల్స్ లో పన్నీర్ సెల్వం కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. కాగా, ప్రస్తుతం, తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి మొదట్లో నైనార్ నాగేంద్రన్, తమిళిసై సౌందరరాజన్, వానతి శ్రీనివాసన్, అన్నామలై పేర్లు ప్రచారం అవుతున్నాయి. ఇక, ఇప్పటికే తమిళిసై గతంలో ఒకసారి అధ్యక్ష పదవిని నిర్వహించారు.

Exit mobile version