NTV Telugu Site icon

NCERT: 12 తరగతి సిలబస్ నుంచి బాబ్రీ కూల్చివేత, గుజరాత్ అల్లర్ల అంశాలు తొలగింపు..

Babri Masjid

Babri Masjid

NCERT: నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) 12వ తరగతి స్కూల్ పుస్తకాల్లో కీలక మార్పులను చేసినట్లు తెలుస్తోంది. పొలిటికల్ సైన్స్ పుస్తకాల నుంచి బాబ్రీ మసీదు కూల్చివేత అంశాన్ని తీసేసింది. దీంతో పాటు హిందుత్వ రాజకీయాలు, గుజరాత్ అల్లర్లు, మైనారిటీలకు సంబంధించిన కొన్ని సున్నితమైన అంశాలను పుస్తకాల నుంచి తొలగించనుంది. ఈ మార్పులతో కొత్త పుస్తకాలు 2024-25 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయబడనున్నాయి. NCERT ఈ మార్పులను గురువారం (ఏప్రిల్ 4) తన వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. సెంట్రల్ బోర్డ్ ఆప్ సెకండరీ ఎడ్యుకేషన్(CBSE)కి అనుబంధంగా ఉన్న పాఠశాలల్లో NCERT పుస్తకాలు బోధించబడుతాయి. దేశంలో 30 వేలకు వరకు సీబీఎస్‌సీ స్కూల్స్ ఉన్నాయి.

Read Also: Fire Accident: ఛత్తీస్‌గఢ్‌లో భారీ అగ్నిప్రమాదం.. విద్యుత్ సబ్‌స్టేషన్ దగ్ధం

పొలిటికల్ సైన్స్ పుస్తకాల్లో బాబ్రీ కూల్చివేత ప్రస్తావన ఉన్న పుస్తకంలో మూడు చోట్ల మార్పులు చేయాలని NCERT నిర్ణయించింది. దీనికి బదులుగా రామమందిర ఉద్యమాన్ని బోధించనున్నారు. దీంతో పాటు రామ మందిరానికి సంబంధించి సుప్రీంకోర్టు ఏ ప్రాతిపదికన తీర్పునిచ్చిందో కూడా వివరంగా బోధించనున్నారు.‘స్వాతంత్ర్యం అనంతరం భారతదేశ రాజకీయాలు’ పేరుతో ఉన్న 8వ అధ్యాయంలో ఈ మార్పు చేసింది. ఈ అధ్యాయం 2006-07లో పొలిటికల్ సైన్స్ పుస్తకాల్లో చేర్చబడింది. స్వాతంత్ర్యం అనంతరం జరిగిన 5 ముఖ్యమైన భారత రాజకీయ పరిణామాలను ఈ అధ్యాయంలో చర్చించారు. దీంట్లో ఒకటి అయోధ్య ఉద్యమం.

ఇదే కాకుండా 1989లో కాంగ్రెస్ ఓటమి తర్వాత నాలుగు సంఘటనలను ప్రస్తావించారు. 1990లో మండల్ కమిషన్ అమలు, 1991 ఆర్థిక సంస్కరణల ప్రారంభం, అదే ఏడాది రాజీవ్ గాంధీ హత్య వంటి 5 ముఖ్యమైన సంఘటనలను హైలెట్ చేస్తుంది.జమ్మూ కాశ్మీర్‌కి సంబంధించి కొన్ని అంశాలను మార్చారు. గతంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్‌పై ‘‘ ఈ ప్రాంతం అక్రమ ఆక్రమణలో ఉందని భారత్ పేర్కొంది. పాకిస్తాన్ ఈ ప్రాంతాన్ని ఆజాద్ పాకిస్తాన్ గా అభివర్ణింస్తుంది’’ అయితే దీనిని మారుస్తూ.. ఇది పాకిస్తాన్ అక్రమ ఆక్రమణలో ఉన్న భారత భూభాగం, దీనిని పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్((POJK) అని పిలుస్తారని మార్పు చేసింది. డెమెక్రటిక్ రైట్స్ పేరుతో ఉన్న 5వ అధ్యాయంలో గుజరాత్ అల్లర్లకు సంబంధించిన అంశాలను తీసేసింది.