Bidar Accident: కర్ణాటకలోని బీదర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం కూలీ పనికి వెళుతున్న వారిని మృత్యువు కబలించింది. కూలీలు వెళుతున్న ఆటోరిక్షాను ట్రక్కు ఢీ కొనడంతో 7మంది అక్కడికక్కడే మరణించగా.. 11 మందికి గాయాలయ్యాయి. రోజూలాగా శుక్రవారం అర్థరాత్రి ట్రక్కు, ఆటో రిక్షా ఢీకొన్న ప్రమాదంలో ఏడుగురు మహిళలు మృతి చెందగా, 11 మంది గాయపడ్డారు. మహిళలు అందరూ కూలీలు, పని ముగించుకుని ఆటో రిక్షాలో ఇంటికి తిరిగి వస్తుండగా బీదర్‌లోని బేమలఖేడా ప్రభుత్వ పాఠశాల సమీపంలో ట్రక్కు ఢీకొట్టింది. మహిళలను పార్వతి (40), ప్రభావతి (36), గుండమ్మ (60), యాదమ్మ (40), జగ్గమ్మ (34), ఈశ్వరమ్మ (55), రుక్మిణి బాయి (60)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన 11 మందిలో రెండు వాహనాల డ్రైవర్లు ఉన్నారని, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read also: WhatsApp New Feature : వాట్సాప్ అదిరిపోయే ఫీచర్.. ఫోటో బ్లర్ చేసుకునే ఆప్షన్
నిన్న మధ్యప్రదేశ్‌లోని బెతుల్ జిల్లాలోని ఝల్లార్ పోలీస్ స్టేషన్ పరిధిలో బస్సు, కారు ముందు వైపు నుండి ఒకదానికొకటి ఢీకొట్టకున్నాయి. ఈ ఘటనలో 11 మంది అక్కడికక్కడే మృతిచెందిరు. అయితే ఓ ప్రయాణికుడికి తీవ్ర గాయాలు కాగా.. అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈఘటనపై బేతుల్ ఎస్పీ సిమ్లా ప్రసాద్ కు సమాచారం అందించారు. అయితే.. ఫోటోలో వున్న విధంగా చూస్తే.. బస్సు – కారు ఎదురెదురుగా ఢీకొన్నాయని అర్థం అవుతోంది. కారు ఎలా తుక్కుతుక్కు అయిందో చూడవచ్చు. కారులో ప్రయాణిస్తున్న వారిలో ఎక్కువ మంది చనిపోయారని భావిస్తున్నారు. బస్సు ముందు భాగం మాత్రమే దెబ్బతింది. ఇక గతనెల అక్టోబర్ 21 రాత్రి దీపావళికి రెండు రోజుల ముందే రేవా జిల్లాలోని సోహగి పోలీస్ స్టేషన్ పరిధిలో సోహగి పర్వతాల వద్ద బస్సు ట్రక్కు ఢీకొట్టడంతో.. 15 మంది ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ నుంచి యూపీ రాజధాని లక్నో వస్తున్న ఈ బస్సులో రోజు కూలీలు ఉన్నారు. దీంతో మధ్యప్రదేశ్‌లో వరుస ప్రమాదాలపై ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
Koti Deepotsavam 2022: ఆరో రోజుకు చేరిన కోటి దీపోత్సవం.. నేటి కార్యక్రమాల షెడ్యూల్
