NTV Telugu Site icon

Rajasthan CM: రాజస్థాన్ సీఎంగా భజన్‌లాల్ శర్మ.. తొలిసారి ఎమ్మెల్యేని వరించిన అత్యున్నత పదవి..

Rajasthan Cm

Rajasthan Cm

Rajasthan CM: రాజస్థాన్ సీఎంగా భజన్ లాల్ శర్మని బీజేపీ అధిష్టానం ప్రకటించింది. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిని బీజేపీ అనూహ్యంగా సీఎంగా ప్రకటించింది. ఈ రోజు జరిగిన శాసనసభపక్ష నేతని ఎన్నుకునే సమావేశంలో సీఎం అభ్యర్థిగా భజన్ లాల్ శర్మని ఎన్నుకున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో సంగనేర్ అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్‌కు చెందిన పుష్పేంద్ర భరద్వాజ్‌పై 48,081 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

రాజస్థాన్ ముఖ్యమంత్రిగా భజన్‌లాల్ శర్మ పేరును మాజీ సీఎం వసుంధర రాజే ప్రకటించారు. సంగనేర్ నుంచి ఈయన తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. బ్రహ్మన వర్గానికి చెందిన ఇతని వైపే బీజేపీ మొగ్గు చూపింది. ప్రస్తుతం బీజేపీ స్టేట్ జనరల్ సెక్రటరీగా భజన్ లాల్ పనిచేస్తున్నారు. దియాకుమారి, ప్రేమ్ చంద్ భైర్వాలను డిఫ్యూటీ సీఎంలుగా బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ.. భజన్ లాల్ శర్మ ఆర్ఎస్ఎస్, ఏబీవీపీలో పనిచేశారు. నాలుగు సార్లు రాజస్థాన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించారు.

Read Also: Rajasthan CM: రాజస్థాన్ సీఎంగా భజన్ లాల్ శర్మ.. తొలిసారి ఎమ్మెల్యేని వరించిన పదవి..

రాజస్థాన్ ముఖ్యమంత్రి రేసులో పలువురు కేంద్రమంత్రులతో పాటు మాజీ సీఎం వసుంధర రాజే ఉన్నప్పటికీ.. అనూహ్యంగా భజన్ లాల్ శర్మని అత్యున్నత పదవి వరించింది. కేంద్రమంత్రులు అశ్విణి వైష్ణవ్, అర్జున్ రామ్ మేఘ్వాల్, గజేంద్ర సింగ్ షెకావత్‌తో పాటు మాజీ సీఎం వసుంధర రాజే, ఎంపీ బాలక్ నాథ్, దియా కుమారి పేర్లు వినిపించాయి. అయితే ఛత్తీస్గడ్, మధ్యప్రదేశ్‌లో అనూహ్యంగా ముఖ్యమంత్రుల పేర్లను ప్రకటించిన బీజేపీ, రాజస్థాన్‌లో కూడా కొత్త వ్యక్తిని సీఎంగా ప్రకటించి సంచలనం సృష్టించింది.

Show comments