Bengaluru world’s second-most traffic congested city: ప్రపంచంలోనే అత్యధిక ట్రాఫిక రద్దీ ఉన్న నగరాల జాబితాలో బెంగళూర్ చోటు సంపాదించుకుంది. లండన్ తర్వాత ప్రపంచంలో రెండో అత్యధిక ట్రాఫిక్ రద్దీ ఉన్న నగరంగా బెంగళూర్ నిలిచింది. టామ్ టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ ప్రపంచంలోని అత్యధిక రద్దీ ఉన్న నగరాలకు ర్యాంకింగ్స్ కేటాయించింది. భారత్ నుంచి బెంగళూర్ రెండో స్థానంలో నిలవగా.. పూణే 6వ స్థానంలో, న్యూఢిల్లీ 34వ స్థానంలో, ముంబై 47వ స్థానంలో ఉన్నాయి. మూడోస్థానంలో ఐర్లాండ్ లోని డబ్లిన్, నాలుగో స్థానంలో జపాన్ లోని సప్పారో, ఐదో స్థానంలో ఇటలీలోని మిలాన్ నగరాలు నిలిచాయి.
Read Also: Bandi Sanjay : సీఎం కేసీఆర్‌కు వేములవాడ రాజన్న శాపం తగులుతుంది
2022 సంవత్సరంలో బెంగళూర్ లో 10 కిలోమీటర్ల దూరాన్ని నడపడానికి దాదాపు 29 నిమిషాల 10 సెకన్ల ప్రయాణ సమయం పట్టింది. ఇదే లండన్ లో 36 నిమిషాల 20 సెకన్లు పట్టింది. 2021తో పోలిస్తే బెంగళూర్ లో ప్రయాణ సమయం 40 సెకండ్లు పెరిగింది. 2022లో బెంగళూర్ ట్రాఫిక్ రద్దీలో అక్టోబర్ 15 శనివారం అత్యంత చెత్త రోజుగా నిలిచిపోయింది. ఆ రోజున 10 కిలోమీటర్లు వాహనాలు ప్రయాణించడానికి 33 నిమిషాల 50 సెకన్లు పట్టింది. అంతకు ముందు 2019లో ప్రపంచంలోనే అత్యంత ట్రాఫిక్ ఉండే నగరంగా నిలిచింది.
2022లో సగటున 10 కిలోమీటర్ల డ్రైవింగ్ కు 260 గంటలు ప్రయాణి కాలంలో 134 గంటలు ట్రాఫిక్ రద్దీలోనే వెచ్చించినట్లు డేటా వెల్లడించింది. శుక్రవారం నాడు బెంగళూర్ లో వాహనాలు డ్రైవింగ్ చేయకపోవడమే ఉత్తమం అని డేటా తెలిపింది. శుక్రవారంలో సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్య 10 కిలోమీటర్లు ప్రయాణించడానికి 37 నిమిషాల 20 సెకన్లు పడుతుందని, నగరంలో ఉదయం నుంచి సాయంత్ర వరకు ట్రాఫిక్ పై గడిపే సమయం గంటగంటకు పెరుగుతుందని, ఉదయం 8 గంటలకు 10 కిలోమీటర్లు కవర్ చేయడానికి 25 నిమిషాలు పడితే.. సాయంత్రం 6 గంటలకు 37 నిమిషాలు పడుతోంది. వారంలో శుక్ర, శనివారాల్లోనే అత్యధిక ట్రాఫిక్ ఉంటున్నట్లు డేటా వెల్లడించింది.
