NTV Telugu Site icon

Matrimonial frauds: మ్యాట్రిమోని వెబ్‌సైట్ ద్వారా పరిచయమ్యాడు.. నగలతో ఉడాయించాడు..

Matrimoni

Matrimoni

Matrimonial frauds: ఇటీవల కాలంలో మ్యాట్రిమోని వెబ్‌సైట్ మోసాలు పెరిగిపోయాయి. తల్లిదండ్రుల అత్యాశ ఈ మోసాలకు కారణం అవుతోంది. ప్యాకేజీ, ఉద్యోగం, బంగ్లాలు, కార్లను చూసి మోసపోతున్నారు. తప్పుడు సమాచారంతో ముఖ్యంగా మహిళలను మోసం చేస్తున్నారు. చివరకు పెళ్లైన తర్వాత అసలు విషయం తెలియడమో.. లేకపోతే మాయ మాటలు చెప్పి వారి వద్ద నుంచి నగదు, బంగారాన్ని కొట్టేస్తున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే మరొకటి జరిగింది. మ్యాట్రిమోని సైట్ లో పరిచయం అయిన వ్యక్తి తనను మోసం చేశాడని బుధవారం బెంగళూర్ కు చెందిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Read Also: Kiccha Sudeep: బసవరాజ్ బొమ్మైకి మాత్రమే ప్రచారం చేశా.. పార్టీకికాదు..

బెంగళూర్ కు చెంది ఓ మహిళను ఢిల్లీ వ్యక్తి మోసగించాడు. ఎయిర్ లైన్ ఉద్యోగి అయిన 39 ఏళ్ల బెంగళూర్ మహిళకు ఢిల్లీకి చెంది. వ్యక్తి అన్షుల్ జైన్ పేరుతో మాట్రిమోని వెబ్‌సైట్ ద్వారా పరిచయం అయ్యాడు. జైన్ తాను ఢిల్లీలో వ్యాపారవేత్తగా మహిళకు 15 రోజుల క్రితం పరిచయమ్యాడు. అయితే తన కుటుంబాన్ని ఓ వివాహ వేడుకల్లో పరిచయం చేస్తానని, ఢిల్లీకి రావాల్సిందిగా మహిళను కోరారు. అందుకు సదరు బాధిత మహిళ కూడా సరే అంది. అయితే వచ్చేటప్పుడు అందంగా కనిపించేందుకు మంచి దుస్తులు, బంగారు ఆభరణాలు తీసుకురావాలని కోరాడు. ఇవన్ని నమ్మిన మహిళ అన్షుల్ జైన్ చెప్పిన విధంగానే బెంగళూర్ నుంచి ఢిల్లీకి వెళ్లింది.

ఆదివారం తనను నిందితుడు ఢిల్లీ విమానాశ్రయంలో రిసీవ్ చేసుకున్నాడని, ఏరోసిటీ ఫుడ్ కోర్టులో భోజనం చేసిన తర్వాత అక్కడ నుంచి కారులో బయలుదేరామని, అర కిలోమీటర్ దూరం వెళ్లిన తర్వాత కారు టైర్ లో ఏదో తేడాగా ఉందని చెప్పి, టైర్లు తనిఖీ చేసేందుకు దిగిన వెంటనే నిందితుడు తన విలువైన వస్తువులతో పారిపోయాడని మహిళ ఆరోపించింది. తన వద్ద నుంచి 300 గ్రాముల ఆభరణాలు, రూ.15 వేల నగదు, మొబైల్ ఫోన్, మూడు ఏటీఎం కార్డులు, బ్యాగ్ చోరీకి గురయ్యాయని ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.