NTV Telugu Site icon

Marital Dispute: మగాడికి గృహహింస.. భార్య వేధింపులకు టెక్కీ ఆత్మహత్య..

Bemgaluru

Bemgaluru

Marital Dispute: 40 ఏళ్ల టెక్ ప్రొఫెషనల్ ఆదివారం బెంగళూర్‌లోని తన అపార్ట్‌మెంట్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని ప్రశాంత్ నాయర్‌గా గుర్తించారు. వైవాహిక వివాదం కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదని పోలీసులు తెలిపారు. మృతుడు లెనోవా లో సీనియర్ సేల్స్ అండ్ మార్కెటింగ్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఇతడి భార్య పూజా నాయర్ 12 ఏళ్లుగా డెల్‌లో ఉద్యోగం చేస్తోంది. వీరికి 8 ఏళ్ల కూతురు ఉంది. బెంగళూర్‌లో చిక్కబనవారలో నివాసం ఉంటున్నారు.

Read Also: UP: 7 రోజులు బంధించి, 23 మంది సామూహిక అత్యాచారం.. ఇంటర్ విద్యార్థినిపై దారుణం..

పోలీస్ వర్గాల ప్రకారం..ఈ జంట తరుచుగా గొడవపడుతున్నారని, విడాకులు తీసుకోవాలని ఆలోచిస్తున్నారని తెలిసింది. భార్య ప్రశాంత్ నాయర్‌ని మానసికంగా బాధపెడుతుందనే ఆరోపణలు ఉన్నాయి. ప్రశాంత్ నాయర్ ఉరి వేసుకున్న రోజున, అతడి తండ్రి పదే పదే కాల్ చేసిన, లిఫ్ట్ చేయలేదు. దీంతో అనుమానించి అతను ఫ్లాట్‌కి వెళ్లి చూడగా, ఫ్యాన్‌కి వేలాడుతూ కనిపించాడు. దీనిపై సోలదేవనహళ్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వేధింపుల ఆరోపణలను ధ్రువీకరించడానికి ప్రయత్నిస్తున్నారు.

ఈ ఏడాది జనవరిలో బెంగళూర్‌లో యూపీకి చెందిన టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య వ్యవహారం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. 34 ఏళ్ల సుభాష్ 24 పేజీల సూసైడ్ లేఖతో పాటు గంటన్నర వీడియో రికార్డులో తన భార్య, ఆమె తల్లి ఎలా వేధిస్తున్న విషయాన్ని చెప్పాడు. ఈ వీడియో అందరి చేత కంటతడి పెట్టించింది. అక్రమంగా గృహహింస, వరకట్న వేధింపుల కేసులు పెట్టారని అందులో ఆరోపించాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.