Site icon NTV Telugu

Boiled Egg: ఉడకబెట్టిన గుడ్లు తినడంపై భర్తతో గొడవపడి మహిళ ఆత్మహత్య..

Boild Eggs

Boild Eggs

Boiled Egg: ఇటీవల కాలంలో భార్యభర్తల మధ్య చిన్నచిన్న విషయాలే గొడవలకు దారి తీస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఇవి ఆత్మహత్యలు, హత్యలకు దారి తీస్తున్నాయి. తాజాగా బెంగళూర్‌లో ఇలాంటి సంఘటనే జరిగింది. బాయిల్డ్ ఎగ్స్ కోసం గొడవ మహిళ ఆత్మహత్యకు పురిగొల్పింది. ఉడకపెట్టిన కోడిగుడ్లు తిన్నందుకు భర్తతో గొడవ పడిన భార్య భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. కర్ణాటకలో జరిగిన ఈ షాకింగ్ ఘటనలో బెంగళూర్‌లోని మదనాయకనహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మాచోహళ్లిలో జరిగింది. మృతురాలిని పూజగా గుర్తించారు. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Read Also: UP: ఉత్తర్ ప్రదేశ్ లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 3.9 నమోదు

ఎగ్స్ షేర్ చేసుకునే విషయంలో పూజ తన భర్త అనిల్ కుమార్(35)తో గొడవపడి ఆత్మహత్య చేసుకుని మరణించింది. ఈ జంట ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని డియోరియా జిల్లాకు చెందిన వారని పోలీసులు తెలిపారు. మాచోహళ్లిలోని పెయింట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరంతా ఫ్యాక్టరీ భవనంలోని మూడో అంతస్తులోని ఓ గదిలో నివసిస్తున్నారు. ప్రాథమిక విచారణలో, భార్యభర్తులు ఇద్దరూ తరుచూ వంట చేయడంతో సహా చిన్నచిన్న విషయాలపై గొడవపడేవారని తెలిసింది. మే 25న డిన్నర్ సమయంలో దంపతుల మధ్య గొడవ జరిగింది. గొడవ తర్వాత అనిల్, ఇద్దరు పిల్లలు పడుకున్న తర్వాత, పూజ భవనంపై నుంచి దూకి చనిపోయింది.

కుటుంబ పెద్ద అయినందున తనకు అదనంగా ఉడికించిన గుడ్డు కావాలని అనిల్, భార్య పూజను కోరాడని, దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుందని తెలిసింది. పూజని అనిత్ తీవ్రంగా దూషించాడు. తనకు రుచికరమైన ఆహారం చేయడం లేదని, ఆమెను ఎక్కడికైనా వెళ్లి చనిపోవాలని కోపంతో తిట్టాడు. తెల్లవారుజామున 2.30గంటలకు పూజ కనిపించకపోవడంతో, అనిల్ తన సహచరులతో కలిసి వెతకడం ప్రారంభించగా.. నేలపై రక్తపుమడుగులో పూజ చనిపోయిఉంది. ఈ ఘటనలో అనిల్ కారణంగా మరణించడంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Exit mobile version