Bengaluru video: వాకింగ్ చేస్తుండగా మహిళపై దుండగుడు దాడి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!

  • బెంగళూరులో రెచ్చిపోయిన దుండగుడు
  • మహిళపై దుండగుడు దాడి.. కేకలు వేయడంతో పరారీ
Bengaluruvideo

Bengaluruvideo

బెంగళూరులో ఓ దుండగుడు రెచ్చిపోయాడు. మహిళను బలవంతం చేసేందుకు ప్రయత్నించాడు. వాకింగ్‌కు వెళ్లేందుకు స్నేహితురాలి కోసం నిరీక్షిస్తున్న సమయంలో హఠాత్తుగా ఒక వ్యక్తి అమెను పట్టుకుని లైంగికంగా వేధించాడు. దీంతో అతడి నుంచి తప్పించుకునేందుకు పరుగులు తీయగా వెంటపడ్డాడు. దీంతో ఆమె పెద్ద పెద్దగా కేకలు వేయడంతో అక్కడ నుంచి పరారయ్యాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆగస్టు 2వ తేదీన ఉదయం 5 గంటలకు ఈ ఘటన జరిగినట్టు సీసీటీవీ ఫుటేజ్‌లో ఉంది.

ఇది కూడా చదవండి: Infinix Note 40x 5G: తక్కువ ధరలో ఐఫోన్ 15 లుక్‭తో వచ్చేస్తున్న ఇన్ఫినిక్స్ 5G మొబైల్..

బాధితురాలు ఓ ఇంటి ముందు నిలబడి ఉంది. అక్కడి నుంచి ఓ వైపు నడుచుకుంటూ వెళ్లింది. సరిగ్గా అదే సమయంలో ఓ వ్యక్తి.. ఆమెని వెంబడించాడు. చుట్టూ ఎవరు లేకపోవడంతో ఆమెని వెనుక నుంచి బలవంతంగా పట్టుకున్నాడు. ఆ తర్వాత ముద్దు పెట్టాడు. పరుగులు పెడుతూ కేకలు వేసింది. దీంతో అక్కడి నిందితుడు నుంచి పారిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Air India: బంగ్లాదేశ్‌ అల్లర్లు.. ఢాకాకు విమానాలను రద్దు చేసిన ఎయిర్‌ ఇండియా

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్‌కు చెందిన మహిళ రోజూ ఉదయం వాకింగ్‌కు వెళ్తుందని చెప్పారు. తన స్నేహితురాలి కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఆమె వేధింపులకు గురైందన్నారు. దుండగుడు తెల్ల చొక్కా, ప్యాంటు ధరించి ఉన్నాడని వివరించారు. కేకలు వేయడంతో వెంటనే అక్కడి నుంచి పారిపోయాడని పేర్కొన్నారు. భారతీయ న్యాయ సంహిత (బిఎన్‌ఎస్)లోని సెక్షన్ 76, 78, మరియు 79 కింద వ్యక్తిపై కేసు నమోదు చేశామని.. అతని జాడ కోసం గాలింపు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. మహిళ భర్తపై కూడా కేసు పెట్టినట్లు కూడా వారు తెలిపారు. ఈ ఘటనను చాలా సీరియస్‌గా పరిగణిస్తున్నామని, మహిళల భద్రత, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, నిందితుడిని త్వరలోనే పట్టుకుని విచారిస్తామని సౌత్ డీసీపీ లోకేశ్ జగలసర్ తెలిపారు. పోలీసు పెట్రోలింగ్‌ను పెంచాల్సిన అవసరం ఉన్న ప్రాంతాల్లో ఇప్పటికే తగిన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.