NTV Telugu Site icon

Viral News: అయ్యా బాబోయ్.. ఇల్లు కావాలంటే అది ఉండాలా?

House Rents

House Rents

ప్రముఖ నగరాల్లో ఇల్లు అద్దెకు దొరకడం కష్టంగా మారింది.. ఉద్యోగాలని, కుటుంబ పోషణ కోసం, వలస కూలీలు, వ్యాపారాలు చేసుకోవాలని ఇలా చాలామంది నగరాల వైపు పరుగులు పెడుతున్నారు..నగరాలకు వలస వెళ్లి ఏదో చిన్నపాటి ఇల్లు అద్దెకు తీసుకుని జీవనం సాగిస్తున్నారు.. ఇలా ఎవరి స్థోమతకు తగ్గట్లు వాళ్ళు ఇల్లు తీసుకొని జీవనం సాగిస్తున్నారు..అయితే సాధారణంగా ఇల్లు అద్దెకు తీసుకోవాలంటే గుర్తింపు కార్డులు చూపించాల్సి ఉంటుంది. ఎందుకు ఇల్లు అద్దెకు తీసుకుంటున్నారు.. ఎంత మంది ఉంటారు.. ఎక్కడ పనిచేస్తారు వంటి వివరాలను ఇంటి యజమానులకు సమర్పించాల్సి ఉంటుంది..

కానీ బెంగుళూరు లో రూల్స్ మారాయి.. ఓ యువకుడు ట్రైనింగ్ కోసం అని వెళ్లాడు.. ఇల్లు అద్దెకు తీసుకోవాలని అనుకున్నాడు అతని అద్దెకు ఇల్లు దొరకడం కష్టంగా మారిందని చెప్పుకొచ్చాడు.. అంతేకాదు వింత అనుభవం ఎదురైంది. దీంతో అతడు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ హాట్ టాపిక్‌గా మారింది. అక్కడకు యువకుడు ఉన్నత చదువు అభ్యసించేందుకు వెళ్లాడు. అక్కడ నివసించేందుకు ఓ ఇల్లు అద్దెకు తీసుకోవాలని ప్రయత్నించాడు. ఇల్లు కోసం వీధులన్నీ కాళ్లు అరిగేలా తిరిగాడు. టూలెట్ బోర్డులు ఉన్న ఇళ్ల కోసం వెతికి తనకు సౌలభ్యంగా ఉన్న ఇంటిని అద్దెకు తీసుకోవాలని భావించాడు. అయితే ఎంత తిరిగినా తనకు సరైన ఇల్లు దొరక్కపోవడంతో ఓ బ్రోకర్‌కు మెసేజ్ చేశాడు.

అయితే ఆ బ్రోకర్ ఇచ్చిన సమాధానంతో సదరు యువకుడు బిత్తరపోయాడు. ఆ ఇంటి ఓనర్ తన ఇల్లు అద్దెకు ఇవ్వాలంటే ఓ కండీషన్ పెట్టాడని చెప్పాడు.. 12వ తరగతిలో 90 శాతం మార్కులు రావాలని చెప్పాడని చెప్పగానే అతనికి ఫ్యూజులు ఎగిరిపోయింది.. తనకు 12వ తరగతిలో 75 శాతం మార్కులు మాత్రమే రావడంతో ఇల్లు ఇవ్వడం కుదరదని యజమాని చెప్పాడని బ్రోకర్ మేసేజ్ చేసినట్లు యువకుడు తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. ఈ మేరకు అతడు బ్రోకర్‌తో చేసిన చాట్‌ను మొత్తం సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఆ యువకుడి పోస్ట్ వైరల్‌గా మారింది.. అంతేకాదు కాదు.. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.. ఇలాంటి కండిషన్ ఉంటే ఇక చాలా రోడ్డు మీదే ఉండాలని కామెంట్స్ చేస్తున్నారు..