Sinchana Santosh: విద్యార్థిని సంచలనం.. 15 ఏళ్లకే పెట్టుబడులపై పట్టు.. రూ.13.9 లక్షల ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియో
- బెంగళూరు 15 ఏళ్ల విద్యార్థిని సరికొత్త లక్ష్యం
- 10 లక్షల మందికి ఆర్థిక పాఠాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
15-Year-Old Investor’s Financial Literacy Mission: సాధారణంగా పదిహేనేళ్ల వయసులో విద్యార్థుల దృష్టి చదువులు, ఆటలు, ఇతర ఆసక్తులపైనే ఉంటుంది. కానీ బెంగళూరుకు చెందిన 15 ఏళ్ల సించనా సంతోష్ మాత్రం చిన్న వయసులోనే పొదుపు, పెట్టుబడులు, ఆర్థిక అక్షరాస్యతపై ఆసక్తి పెంచుకున్నారు. ప్రస్తుతం ఆమె సుమారు రూ.13.9 లక్షల విలువైన పెట్టుబడి పోర్ట్‌ఫోలియోను తల్లిదండ్రుల పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు. సించనా బెంగళూరులోని ఆర్ఆర్ నగర్లో ఉన్న స్వర్గరాణి స్కూల్లో 10వ తరగతి చదువుతున్నారు. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా 10 లక్షల మంది విద్యార్థులకు ఆర్థిక అక్షరాస్యతను అందించాలన్నది ఆమె లక్ష్యం.
పిగ్గీ బ్యాంక్‌తో మొదలైన ప్రయాణం
సించనాకు చిన్నప్పటి నుంచే డబ్బు పొదుపు చేయడం అలవాటుగా ఉండేది. పిగ్గీ బ్యాంక్‌లో డబ్బులు దాచుకుంటూ 12 ఏళ్ల వయసుకే సుమారు రూ.10,000 కూడబెట్టారు. చిన్న మొత్తాలను క్రమం తప్పకుండా పొదుపు చేస్తే భవిష్యత్తులో అవి ఉపయోగపడతాయని అప్పుడే అర్థమైందని ఆమె తెలిపింది. తనకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేసేందుకు ముందుగానే డబ్బు దాచుకోవడం ద్వారా ఆర్థిక క్రమశిక్షణపై అవగాహన పెరిగిందని చెప్పారు.
Also Read
టెలిస్కోప్ కొనాలనే కోరికతో..
చిన్నతనంలో సించనాకు టెలిస్కోప్ కొనాలనే కోరిక కలిగింది. అయితే ఆమె తండ్రి సంతోష్ కుమార్.. ఆ వస్తువు కోసం కొంత మొత్తాన్ని ఆమె స్వయంగా సమకూర్చుకోవాలని సూచించారు. దీంతో సించనా బంధువులను సంప్రదించి రూ.10,000 సమకూర్చుకున్నారు. మిగిలిన రూ.2,000ను ఆమె తల్లిదండ్రులు అందించారు. ఈ అనుభవమే తన “మనీ జర్నీ”కి ఆరంభమైందని సించనా చెబుతున్నారు.
తల్లిదండ్రులు, యూట్యూబ్ ద్వారా పెట్టుబడులపై అవగాహన
సించనాకు ఆర్థిక అంశాలపై అవగాహన పెంచడంలో ఆమె తల్లిదండ్రులు కీలక పాత్ర పోషించారు. స్వయంగా పెట్టుబడులు నిర్వహించడానికి ముందు పెట్టుబడులపై పూర్తి అవగాహన పెంచుకోవాలని తండ్రి సూచించారు. దీంతో ఆమె యూట్యూబ్ ద్వారా వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాలు, పెట్టుబడులపై విస్తృతంగా నేర్చుకున్నారు. అంకుర్ వారికూ, డేవ్ రామ్సే, పవర్ ఆఫ్ మనీ, మింట్ వెల్త్, సోనియా షెనాయ్ వంటి కంటెంట్ క్రియేటర్లు, ఛానళ్లను కూడా ఆమె అనుసరించారు. వీకెండ్లు, సెలవు రోజులను ఆర్థిక అంశాలు నేర్చుకోవడానికి ఉపయోగించుకున్నానని సించనా తెలిపారు.
రెండు NISM, ఒక SEBI సర్టిఫికేషన్
ఫైనాన్షియల్ లిటరసీని మరింత క్రమబద్ధంగా నేర్చుకునేందుకు సించనా సర్టిఫికేషన్ కోర్సులు కూడా పూర్తి చేశారు. ప్రస్తుతం ఆమెకు రెండు NISM సర్టిఫికేషన్లు, ఒక SEBI సర్టిఫికేషన్ ఉన్నట్లు కుటుంబం తెలిపింది. అయితే ఈ ప్రయాణంలో ఎదురుదెబ్బలు కూడా ఉన్నాయి. ఒకసారి NISM పరీక్షలో ఒక్క మార్కుతో విఫలమైన ఆమె.. మళ్లీ పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించారు.
రూ.13.9 లక్షల పోర్ట్‌ఫోలియో
ఈ ఏడాది నుంచి సించనా పెట్టుబడులపై మరింత సీరియస్‌గా దృష్టి పెట్టారు. సరైన రాబడి ఇవ్వడం లేదని భావించిన కొన్ని బీమా పాలసీల నుంచి కుటుంబం డబ్బును మార్చిన తర్వాత పెట్టుబడులను విస్తరించినట్లు ఆమె కుటుంబం తెలిపింది. ప్రస్తుతం ఆమె రూ.13.9 లక్షల పోర్ట్‌ఫోలియోను తల్లిదండ్రుల పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు. ఈ పెట్టుబడులు ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్‌తో పాటు భారతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో విస్తరించి ఉన్నాయి. ఆమె పెట్టుబడుల కాలపరిమితిని ఏడేళ్లుగా నిర్ణయించుకున్నారు. భవిష్యత్తులో తన మాస్టర్స్ చదువుకు అయ్యే ఖర్చులను సమకూర్చుకోవడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు.
‘GDP’ పేరుతో సించనా పెట్టుబడి విధానం
మ్యూచువల్ ఫండ్లను ఎంపిక చేసుకునేందుకు సించనా ఒక సులభమైన ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించారు. దానికి GDP – Growth, Direct, Passive అని పేరు పెట్టారు.
Growth: వెంటనే డబ్బు అవసరం లేనందున వృద్ధిపై దృష్టి పెట్టే ఫండ్స్‌ను పరిశీలించడం.
Direct: మధ్యవర్తుల ఖర్చులను తగ్గించేందుకు డైరెక్ట్ ప్లాన్స్‌ను పరిగణించడం.
Passive: బెంచ్‌మార్క్ సూచీలను అనుసరించే ప్యాసివ్ ఫండ్స్‌ను పరిశీలించడం.
తనకు పెట్టుబడుల రకాలను గుర్తుంచుకోవడానికి ఈ GDP విధానం సులభంగా ఉంటుందని సించనా చెబుతున్నారు.
చరిత్ర గేమ్‌తో మొదలై.. ఇప్పుడు ఫైనాన్షియల్ గేమ్
సించనాకు నేర్చుకోవడాన్ని ఆటల రూపంలో అందించాలనే ఆసక్తి కూడా ఉంది. 14 ఏళ్ల వయసులో ఆమె ‘ITIHASA – The Royal Game’ అనే చరిత్ర ఆధారిత కార్డ్ గేమ్‌ను రూపొందించారు. ఇది NCERT సిలబస్ ఆధారంగా రూపొందించినట్లు ఆమె కుటుంబం తెలిపింది. ఈ గేమ్‌కు సంబంధించిన 170 సెట్లను బెంగళూరులోని 36 ప్రభుత్వ పాఠశాలలకు అందించారు. అలాగే పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఈ గేమ్‌ను విద్యార్థులకు ఎలా ఉపయోగించాలో శిక్షణ కూడా ఇచ్చారు.
10 లక్షల మంది విద్యార్థులకు ఆర్థిక అక్షరాస్యత
ప్రస్తుతం సించనా మరో కార్డ్ గేమ్‌పై పనిచేస్తున్నారు. ఇందులో బడ్జెటింగ్, బ్యాంకింగ్, వడ్డీ, ద్రవ్యోల్బణం, పెట్టుబడులు, రిస్క్, ఇన్సూరెన్స్, క్రెడిట్, అప్పులు, ఆర్థిక మోసాలపై అవగాహన వంటి అంశాలను చేర్చుతున్నారు. ఆర్థిక అంశాలను కేవలం పుస్తకాల ద్వారా కాకుండా అనుభవాత్మకంగా నేర్చుకునేలా చేయడం ద్వారా దేశంలోని 10 లక్షల మంది విద్యార్థులకు ఫైనాన్షియల్ లిటరసీ అందించాలన్నది సించనా లక్ష్యం. యువత కొత్త విషయాలను ప్రయత్నించేందుకు వెనుకాడకూడదని, నేర్చుకున్న జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవాలని తాను నమ్ముతున్నట్లు సించనా తెలిపారు.
తాజావార్తలు
-
Sinchana Santosh: విద్యార్థిని సంచలనం.. 15 ఏళ్లకే పెట్టుబడులపై పట్టు.. రూ.13.9 లక్షల ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియో
-
Payal Mehta: జర్నలిస్ట్ పాయల్ మెహత మరణానికి అసలు కారణమేంటి?
-
Lust Stories 3: భార్య అదితితో ఇంటిమేట్ సీన్స్.. కెమెరా ముందు అసలు ఏం జరిగిందో చెప్పిన సిద్ధార్థ్!
-
Varanasi Update: ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్, క్లైమాక్స్.. ‘వారణాసి’పై క్రేజీ అప్డేట్ వైరల్!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
ట్రెండింగ్
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?