Site icon NTV Telugu

Bengal poll violence: బెంగాల్‌లో ఆగని హత్యా రాజకీయాలు.. 17 ఏళ్ల టీఎంసీ కార్యకర్త హత్య

West Bengal

West Bengal

Bengal poll violence: పశ్చిమ బెంగాల్ లో పంచాయతీ ఎన్నికలు రక్తపాతానికి కేంద్రం అవుతున్నాయి. ముఖ్యంగా అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీల మధ్య హత్యారాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. ఇరు పార్టీల కార్యకర్తలు దుండగులు జరిపిన దాడుల్లో మరణిస్తున్నారు. అయితే ఇరు పార్టీలు కూడా మీరంటే, మీరంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. ఇదిలా ఉంటే 17 ఏళ్ల తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీకి చెందిన కార్యకర్త దారుణంగా హత్యకు గురయ్యాడు.

Read Also: Chikoti Praveen: మరోసారి తెరపైకి చీకోటి ప్రవీణ్‌.. గజ్వేల్‌లో కేసు నమోదు

నార్త్ 24 పరగణ జిల్లాలో మంగళవారం రాత్రి జరిగిన దాడిలో 17 ఏళ్ల ఇమ్రాన్ హసన్ మరణించాడు. టీఎంసీ ఊరేగింపులో పాల్గొని ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితుడిపై దుండగులు బాంబులు విసరడంతో మరణించాడు. ఈ ఘటన దేగంగా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 11వ తరగతి చదువుతున్న ఇమ్రాన్ హసన్ అనే విద్యార్థి టీఎంసీ కార్యకర్త. అతడిని ప్రత్యర్థులు లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు తెలుస్తోంది. బాంబు దాడితో అతని ఛాతిపై తీవ్రగాయాలయ్యాయి. ఈ దాడికి సీపీఎం, ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ తమ కార్యకర్తలు తమపై దాడికి తెగబడ్డారని ప్రత్యక్ష సాక్షి మహ్మద్ హలీమ్ మండల్ ఆరోపించారు. టీఎంసీ ఊరేగింపు జరిగిన తర్వాత తిరిగి వస్తున్న క్రమంలో దుండగులు స్కూల్ పైకప్పు, జహంగీర్ ఘాజీ అనే వ్యక్తి ఇంటిపై నుంచి బాంబులు విసిరినట్లు ఆరోపించారు.

పశ్చిమ బెంగాల్ లో జూలై 8న పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. టీఎంసీ, బీజేపీలు ఇరు పక్షాలు దాడులు చేసుకుంటున్నాయి. ఈ ఘర్షణల్లో ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు మరణిస్తున్నారు. టీఎంసీ హత్యారాజకీయాలకు పాల్పడుతుందని బీజేపీ ఆరోపించింది. మరోవైపు కలకత్తా హైకోర్టు ఈ ఎన్నికల్లో కేంద్ర బలగాలను మోహరించాలని ఆదేశించింది.

Exit mobile version