Mamata Banerjee: మమత బుక్స్ లైబ్రరీల నుంచి ఔట్.. బీజేపీ సర్కార్ కీలక చర్య.!
- మమత బుక్స్ లైబ్రరీల నుంచి తొలగింపు..
- కీలక నిర్ణయం తీసుకున్న బీజేపీ సర్కార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ రాజకీయాలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఘోర పరాజయం తర్వాత మమతా బెనర్జీకి వరస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే ఆమె పార్టీ తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ముక్కలైంది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు దీదీ మాటను వినే పరిస్థితుల్లో లేరు. ఇక ఎన్నికల సమయంలో మతవిద్వేషాలు పెంచేలా కామెంట్స్ చేసినందుకు ఆమెపై కేసు నమోదైంది. మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ అవినీతిపై విచారణ మొదలైంది.
ఇలాంటి పరిణామాల నేపథ్యంలో బెంగాల్ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఆమె పుస్తకాలను ప్రభుత్వం లైబ్రరీల నుంచి తొలగించే అవకాశం ఉందని పశ్చిమ బెంగాల్ గ్రంథాలయ సేవల మంత్రి గౌరీ శంకర్ ఘోష్ చెప్పారు. జ్ఞానం, మేధో వికాసం, జాతీయవాద భావాలకు దోహదపడే పుస్తకాలు లైబ్రరీల్లో ఉంచబోతున్నట్లు చెప్పారు. ‘ఎపాంగ్ ఓపాంగ్ ఝపాంత్’ వంటి పుస్తకాలకు లైబ్రరీల్లో చోటు ఉండదని స్పష్టం చేశారు. రవీంద్రనాథ్ టాగోర్, కాజీ నజ్రుల్ ఇస్లాం, స్వామి వివేకానంద వంటి సాహిత్య, ఆధ్యాత్మిక దిగ్గజాల రచనలతో పాటు, ఛత్రపతి శివాజీ మహారాజ్, మహారాణా ప్రతాప్ వంటి చారిత్రక వ్యక్తుల జీవిత చరిత్రలు గ్రంథాలయాల్లో అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు.
Also Read
- CJP Deepfake Case: PM మోదీతో మహిళ మార్ఫ్డ్ ఫొటోలు.. CJP నేతలకు హైకోర్టు నోటీసులు
- Gyanesh Kumar: ‘జ్ఞానేష్ కుమార్‌కు పద్మభూషణ్ ఇవ్వాలి’.. బెంగాల్ బీజేపీ చీఫ్ వ్యాఖ్యలు
- Pakistan: ‘‘హఫీజ్ సయీద్‌ను ఎప్పుడు విచారిస్తారు?’’.. పాకిస్తాన్ ప్రధాని మౌనం..
- ECI: "ఆ వార్త నమ్మొద్దు".. సీఈసీ జ్ఞానేష్ కుమార్ యూపీ పర్యటన రద్దుపై ఈసీఐ క్లారిటీ..
మమతా బెనర్జీ ప్రభుత్వం హయాంలో ఏడాది క్రితం లైబ్రరీల్లో ఆమె రచించిన పుస్తకాలను చేర్చాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇప్పుడు ఆ నిర్ణయాన్ని బీజేపీ ప్రభుత్వం రద్దు చేయబోతున్నట్లు తెలుస్తోంది. 2025లో టీఎంసీ సర్కార్ పాఠశాల లైబ్రరీల కోసం 515 పుస్తకాలను ఆమోదించింది. వీటిలో 90 పుస్తకాలు మమతా బెనర్జీ రచించినవే. ఇప్పుడు వీటిని తొలగించేందుకు బీజేపీ సర్కార్ సిద్ధమైంది.
తాజావార్తలు
-
Rohingya Crisis: ‘‘రోహింగ్యాలను మయన్మార్ పంపాలి’’.. బంగ్లాదేశ్ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
-
Nayanathra : వయసుతో పనేముంది? కుర్ర హీరోతో లేడీ సూపర్ స్టార్ రొమాన్స్.. ఓటీటీలోకి వచ్చేసిన ‘హాయ్’!
-
AP Excise Policy 2026-27: కొత్త ఎక్సైజ్ పాలసీకి రంగం సిద్ధం.. 807 మద్యం దుకాణాలకు లాటరీ!
-
TATA Aeris: టాటా నుంచి ఏరిస్ కారు లాంచ్.. ధర, ఫీచర్స్ వివరాలిలా..
-
TV Nandi Awards: తిరుపతి వేదికగా ‘నంది’ అవార్డుల వేడుక.. పరభాషా నటులపై ఆంక్షలు?
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!