Maharashtra: బిడ్డను బయటకు తీసి కడుపులో గ్లోవ్స్ మరిచారు..
- కడుపులో సర్జికల్ గ్లోవ్స్, పేపర్ న్యాప్కిన్లు..
- ప్రసవం కోసం వెళ్లిన మహిళకు ప్రాణాపాయం..
- వైద్యుల నిర్లక్ష్యంపై ఉన్నతాధికారుల విచారణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra: మహారాష్ట్రలో బీడ్ జిల్లాలో వైద్యుల నిర్లక్ష్యానికి 19 ఏళ్ల యువతి ప్రాణాపాయ స్థితిలో ఉంది. సిజేరియన్ ఆపరేషన్ తర్వాత కడుపులో సర్జికల్ గ్లోవ్స్, పేపర్ న్యాప్కిన్లు మరిచిపోయారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. తీవ్ర కడుపు నొప్పితో సదరు యువతి పూణేలోని సాసూన్ ఆస్పత్రిలో ప్రాణాల కోసం పోరాడుతోంది.
సంధ్యా సూరజ్ గైక్వాడ్ ఆగస్టు 1న ప్రసవం కోసం బీడ్ జిల్లా ఆస్పత్రిలో చేరారు. అక్కడ ఆమెకు సిజేరియన్ ఆపరేషన్ జరిగింది. నాలుగు రోజుల తర్వాత ఆమెను డిశ్చార్జ్ చేశారు. అయితే, ఇంటికి వెళ్లిన కొద్దిరోజుల్లోనే ఆమెకు తీవ్రమైన కడుపు నొప్పి మొదలైంది. ఆమె పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ వైద్యులు ఆమె కడుపులో ఏదో తెలియని వస్తువులు ఉన్నట్లు గుర్తించారు. పరిస్థితి విషమించడంతో పూణేకు తరలించారు. పూణేలో వైద్యులు ఆపరేషన్ చేసిన కడుపులో సర్జికల్ గ్లోవ్స్, పేపర్ న్యాప్కిన్లు తొలగించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు.
Also Read
- Jammu Kashmir: పాక్‌కు దిమ్మతిరిగే ప్రకటన.. కాశ్మీర్‌పై యూఎస్ రాయబారి సెర్గియో గోర్ కీలక వ్యాఖ్యలు
- Central Cabinet Decision: ఏపీకి రైల్వే ప్రాజెక్ట్‌లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే..!
- Bangladesh: గంగా జలాలపై బంగ్లాదేశ్ కన్ను.. భారత్‌పై ఒత్తిడి పెంచే ప్లాన్..
- Kerala: తాత హత్యకు 13 ఏళ్ల బాలిక కుట్ర.. వీడియో కాల్లో హత్యను చూస్తూ!
ఈ ఆరోపణలపై బీడ్ జిల్లా యంత్రాంగం స్పందించింది. ఘటనపై విచారణకు ఆదేశించింది. సంబంధిత మహిళా వైద్యురాలు, ఇతర ఆరోగ్య సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆపరేషన్ సమయంలో ఉపయోగించిన వస్తువులు రోగి కడుపులోకి ఎలా వెళ్లాయి.? అనే అంశాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. బాధ్యులుగా తేలితే కఠినమైన చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు.
తాజావార్తలు
-
Maharashtra: బిడ్డను బయటకు తీసి కడుపులో గ్లోవ్స్ మరిచారు..
-
Telangana High Court: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌లపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
Toxic Ticket Prices: డబ్బింగ్ మూవీకి ఇంత రేటా? ‘టాక్సిక్’ టికెట్ ధరలపై సినీ లవర్స్ ఫైర్!
-
Trump: ట్రంప్‌తో ఫొటో దిగాలని ముచ్చటపడుతున్నారా? ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
-
SBI New Withdrawal Rules: మీకు SBIలో ఈ ఖాతా ఉందా..? విత్‌డ్రాయల్‌పై కొత్త ఛార్జీలు.. నయా రూల్స్ ఇవే
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!