Basavalinga Swamy: కర్ణాటకలో మరో మఠాధిపతి సూసైడ్.. ఆ బెదిరింపులే కారణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Basavalinga Swamy Commits Suicide By Hanging: కొన్ని రోజుల క్రితం కర్ణాటకలో బసవ సిద్ధలింగ స్వామి అనే మఠాధిపతి సూసైడ్ ఘటన మరువకముందే.. తాజాగా మరో మఠాధిపతి ఆత్మహత్య చేసుకున్నారు. రామనగర జిల్లా కెంపుపురా గ్రామంలోని శ్రీ కంచుగల్ మఠానికి చెందిన 45 ఏళ్ల బసవలింగ స్వామి.. సోమవారం ఉదయం ఆశ్రమం ఆవరణలో శవమై కనిపించారు. పూజా గదికి ఉన్న కిటికీ గ్రిల్‌కు ఉరివేసుకొని.. ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈయనకు రోజూ ఉదయం 4 గంటలకే నిద్ర లేచే అలవాటు ఉంది. కానీ.. సోమవారం మాత్రం ఉదయం 6 గంటలు అవుతున్నా ఆయన కనిపించలేదు. దాంతోపాటు పూజ గది తలుపులు కూడా మూసి ఉన్నాయి. దీంతో అనుమానం వచ్చిన సిబ్బంది తలుపులు పగలగొట్టి చూడగా.. ఆయన కిటికీ గ్రిల్‌కి ఉరి వేసుకొని కనిపించారు.
ఈ సమాచారాన్ని పోలీసులకు తెలియజేయగా.. సంఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అంతకుముందు స్వామీజీ మృతదేహాన్ని పరిశీలించగా.. రెండు పేజీల సూసైడ్ లెటర్ దొరికింది. తనను మఠాధిపతి నుంచి తొలగించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని.. వ్యక్తిత్వాన్ని తప్పుబడుతూ వేధింపులకు గురిచేస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. తనని ఎవరెవరు బెదిరిస్తున్నారో.. వాళ్ల పేర్లను కూడా ఆ లెఖలో రాసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే బ్లాక్‌మెయిల్ కారణంగా ఆయన ఆత్మహత్య చేసుకున్నారని తమ ప్రాథమిక విచారణలో పోలీసులు తేల్చారు. మరింత లోతుగా విచారణ చేపట్టారు. కాగా.. 400 ఏళ్ల చరిత్ర కలిగిన కంచుగల్ మఠానికి 1997లో బసవలింగ స్వామి ప్రధాన పీఠాధిపతిగా నియమితులయ్యారు. అప్పటి నుంచి ఆయనే ఈ మఠానికి అధిపతిగా కొనసాగుతున్నారు.
Also Read
- Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
- UPI MDR Charges: వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. రూ.2,000 దాటితే పడే ఛార్జీలపై బ్రేక్..
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం క్లారిటీ.. ఎప్పటి నుంచి అమల్లోకి అంటే..!
- Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
తాజావార్తలు
-
Osmania Hospital Protest: ఉస్మానియాలో జూడాల ఆందోళన.. ప్రభుత్వానికి 10 రోజుల డెడ్‌లైన్.!
-
DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
-
Pawan Kalyan-TDP Leaders Meets: టీడీపీ–జనసేన సీట్ల సర్దుబాటుపై కసరత్తు.. పవన్ కల్యాణ్‌తో పల్లా, నిమ్మల భేటీ
-
Explainer: మానవాళి కథ ముగియబోతోంది!?
-
Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!