Site icon NTV Telugu

India- Bangladesh: భారత్‌తో ఉన్న వాణిజ్య సమస్యలను త్వరలోనే పరిష్కరించుకుంటాం..

India

India

India- Bangladesh: బంగ్లాదేశ్‌ను కట్టడి చేసేందుకు భారత ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. ఆ దేశ దిగుమతులపై అనేక పరిమితులను విధిస్తున్నట్లు పేర్కొనింది. ఈ నేపథ్యంలో భారత్‌తో నెలకొన్న వాణిజ్య సమస్యలను త్వరలోనే పరిష్కరించుకుంటామని తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్‌ చెప్పుకొచ్చారు. ఈ మేరకు బంగ్లాదేశ్ వాణిజ్య సలహాదారు షేక్‌ బషీరుద్దీన్‌ మీడియాతో వెల్లడించారు.

Read Also: Gulzar House: గుల్జార్‌హౌస్‌ అగ్నిప్రమాదం వెనుక అక్రమ కరెంట్‌ కనెక్షన్..!

అయితే, భారత్‌ తీసుకున్న చర్యలకు సంబంధించి మాకు ఇంకా అధికారిక సమాచారం రాలేదని బంగ్లా వాణిజ్య సలహాదారు షేక్ బషీరుద్దీన్ తెలిపారు. సమాచారం అందిన తర్వాత చర్యలు తీసుకుంటాం అన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే చర్చలతో వాటిని పరిష్కరించుకునేలా ప్లాన్ చేస్తామన్నారు. అఖౌరా, డాగి పోర్టులతో పాటు కొన్ని సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి పలు నిర్ణయాలను భారత్‌ తీసుకున్నట్లు తెలుస్తుంది.. ఇది రెండు దేశాలకు మంచి విషయం.. వస్త్ర పరిశ్రమలో భారత్‌ మొదటి స్థానంలో ఉందని తాము భావిస్తున్నాం.. ఇప్పటికీ, ఆయా ఉత్పత్తులు మా దేశం నుంచి ఎగుమతి అవుతున్నాయని వెల్లడించారు. భారత్‌- బంగ్లాదేశ్ పొరుగు దేశాలు. సహజంగానే వాణిజ్యం, రవాణా లాంటి వాటిల్లో పోటీ అనేది ఉంటుంది. ఈ క్రమంలోనే కొన్ని సార్లు మేము ఆంక్షలు విధిస్తాం.. అలాగే భారత్ కూడా చేస్తోంది.. వాణిజ్య ప్రక్రియలో ఇది భాగం మాత్రమేనని తేల్చి చెప్పారు. ఇందులో ఏమైనా సమస్యలు ఉంటే రెండు దేశాలు పరిష్కారం చేసుకుంటాయని బషీరుద్దీన్‌ చెప్పారు.

Read Also: Gulzar House: గుల్జార్‌హౌస్‌ అగ్నిప్రమాదం వెనుక అక్రమ కరెంట్‌ కనెక్షన్..!

ఇక, గత నెలలో భారత్‌ నుంచి వచ్చే వస్తువులపై బంగ్లాదేశ్ పరిమితులు విధించింది. దీనికి ప్రతిస్పందనగా.. ఇండియా అక్కడి నుంచి దిగుమతయ్యే రెడీమేడ్‌ దుస్తులు, శుద్ధి చేసిన ఆహార పదార్థాలు, కార్బొనేటెడ్‌ డ్రింక్స్‌, పత్తి, నూలు వ్యర్థాలు, ప్లాస్టిక్‌, పీవీసీ వస్తువులు, కలప ఫర్నీచర్‌ తదితర అన్నింటిని ఆపేసింది. ఈ సరకులను కోల్‌కతా నౌకాశ్రయం, ముంబైలోని జవహర్‌లాల్‌ నెహ్రూ నౌకాశ్రయం నుంచి మాత్రమే భారత దేశంలోకి వస్తాయి. కానీ, బంగ్లా నుంచి దిగుమతి అయ్యే చేపలు, ఎల్పీజీ, వనస్పతి, కంకర లాంటి వాటికి ఈ ఆంక్షలు వర్తించవని భారత్‌ స్పష్టం చేసింది.

Exit mobile version