Site icon NTV Telugu

Air India: బంగ్లాదేశ్‌ అల్లర్లు.. ఢాకాకు విమానాలను రద్దు చేసిన ఎయిర్‌ ఇండియా

Air India

Air India

Air India: బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తిన నేపథ్యంలో ఎయిర్‌ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాకు తన విమానాల రాకపోకలను రద్దు చేసింది. ఈ మేరకు ఎయిర్‌ ఇండియా అధికారిక ప్రకటన చేసింది. ఢాకాకు విమానాల రాకపోకల రద్దు తక్షణమే అమల్లోకి వస్తుందని ఆ ప్రకటనలో పేర్కొన్నది. షెడ్యూల్‌ ప్రకారం భారత్‌ నుంచి ఢాకాకు వెళ్లాల్సిన, ఢాకా నుంచి భారత్‌కు రావాల్సిన విమానాలను రద్దు చేసినట్లు తెలిపింది.

Read Also: Laptop Battery Life Tips: ల్యాప్‌టాప్ బ్యాటరీ లైఫ్ వల్ల ఇబ్బంది పడుతున్నారా..? ఈ టిప్స్ పాటించండి

బంగ్లాదేశ్‌లో పరిస్థితిని తాము నిరంతరం పర్యవేక్షిస్తామని, ఇప్పటికే ఇండియా నుంచి ఢాకాకు, ఢాకా నుంచి ఇండియాకు విమాన టికెట్లు బుక్‌ చేసుకున్న ప్రయాణికులు.. తమ టికెట్లను రీషెడ్యూల్‌ చేసుకున్నా, రద్దు చేసుకున్నా చార్జీల నుంచి పూర్తి మినహాయింపును ఇస్తామని ఎయిరిండియా స్పష్టంచేసింది. ‘మా అతిథులు, సిబ్బంది సంక్షేమమే మాకు తొలి ప్రాధాన్యం’ అని వెల్లడించారు.

Exit mobile version