NTV Telugu Site icon

Sheikh Hasina: షేక్ హసీనా, కుటుంబపై మరో నేరం.. 5 మిలియన్ డాలర్ల అవినీతిపై విచారణ..

Sheikh Hasina

Sheikh Hasina

Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై ప్రస్తుతం మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం వరసగా అభియోగాలు మోపుతోంది. ఇప్పటికే ఆగస్టులో చెలరేగిన విద్యార్థుల అల్లర్లలో మానత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తించి, పలువురు మరణాలకు కారణమైందనే నేరం ఆమెపై మోపారు. షేక్ హసీనాతో పాటు ఆమె పార్టీ అవామీ లీగ్ కార్యకర్తలపై కూడా కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే, తాజాగా షేక్ హసీనా, ఆమె కుటుంబం 5 బిలియన్ డాలర్ల అవినీతికి పాల్పడినట్లు అభియోగాలు మోపింది. ఈ కేసులో హసీనాతో పాటు మరొకరిపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

బంగ్లా రూప్‌పూర్ అణు విద్యుత్ ప్లాంట్‌లో 5 బిలియన్ డాలర్లు దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై బంగ్లాదేశ్ యాంటీ గ్రాఫ్ట్ ప్యానెల్ దర్యాప్తు ప్రారంభించినట్లు మీడియా నివేదికలు తెలిపాయి. బంగ్లాలో రష్యా ప్రభుత్వ సంస్థ రోసాటమ్ నిర్మిస్తున్న రూప్‌పూర్ అణువిద్యుత్ ప్లాంట్ నిర్మించడంలో భారతీయ కంపెనీలు పాల్గొంటున్నాయి. రాజధాని ఢాకాకు పశ్చిమాన 160 కి.మీ దూరంలో బంగ్లాదేశ్‌లోనే తొలి అణు విద్యుత్ కేంద్రం నిర్మించబడుతోంది.

Read Also: America: దత్తపుత్రులపై అత్యాచారానికి పాల్పడిన స్వలింగ సంపర్కుల జంట.. వందేళ్ల జైలు శిక్ష

ఈ కేసులో హసీనాతో పాటు ఆమె కుమారుడు సజీబ్ వాజెడ్ జాయ్, ఆమె మేన కోడులు, యూఎస్ ట్రెజరీ మంత్రి తులిప్ సిద్ధిక్‌లను యకూడా ప్రశ్నించినట్లు అక్కడి మీడియా ఆదివారం నివేదించింది. రూప్‌పూూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టులో 5 బిలియన్ డాలర్లు దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. రూప్పూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ నుండి హసీనా, జాయ్, తులిప్ మలేషియా బ్యాంకుకు 5 బిలియన్ డాలర్లు బదిలీ చేయడంపై ఎందుకు చర్యలు తీసుకోలేని అవినీతి నిరోధక కమిషన్(ఏసీసీ)ని హైకోర్టు ఆదేశించిన రెండు రోజుల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. ఈ పవర్ ప్లాంట్ నిర్మాణంలో అవకతవకలను నేషనల్ డెమోక్రటిక్ మూవ్‌మెంట్ (ఎన్‌డిఎం) చైర్మన్ బాబీ హజ్జాజ్ వెలుగులోకి తెచ్చారు.

షేక్ హసీనా ఆగస్టు 05న బంగ్లా నుంచి భారత్‌కి పారిపోయి వచ్చింది. విద్యార్థుల హింసాత్మక నిరసనల తర్వాత ఆమె భారత్ వచ్చారు. ఆమె సోదరి రెహానా కూడా ఆమె వెంటే ఉన్నారు. ఆమె కొడుకు జాయ్ ప్రస్తుతం యూకేలో నివసిస్తున్నాడు. ఆమె మేనకోడలు తులిప్ బ్రిటిష్ పార్లమెంట్ సభ్యురాలు.

Show comments