Site icon NTV Telugu

Bangalore Doctor Running: కారు వదిలి 3 కిలోమీటర్లు పరిగెత్తిన డాక్టర్.. ఎందుకో తెలుసా?

Blr Doctor

Blr Doctor

డాక్టర్ అంటే దేవుడితో సమానం.. వైద్యో నారాయణో హరి అంటారు. కానీ ఆ మాటలు అప్పుడప్పుడు నిజం అవుతుంటాయి. చావుబతుకుల మధ్య వున్న రోగికి వైద్యసేవలతో పునర్జన్మ ఇస్తాడు వైద్యుడు. బెంగ‌ళూరుకు చెందిన ఓ డాక్ట‌ర్ చేసిన పని వైరల్ అవుతోంది. ఆస్పత్రికి వెళ్ళడానికి ఆయ డాక్టర్ పడిన తాపత్రయం అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఓ డాక్ట‌ర్ 45 నిమిషాల పాటు నిర్విరామంగా పరిగెత్తి హాస్పిట‌ల్ కు చేరుకుని దేవుడు అనిపించుకున్నాడు. సకాలంలో రోగికి ఆపరేషన్ చేసి తన కర్తవ్యాన్ని నెరవేర్చాడు.

కర్ణాటక బెంగళూరులో వర్షాలు జనానికి నరకం చూపిస్తున్నాయి. గత నెల జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స‌ర్జాపూర్‌లో ఉన్న మ‌ణిపాల్ హాస్పిట‌ల్‌లో గ్యాస్ట్రో ఎంట‌రాల‌జీ స‌ర్జ‌న్‌గా చేస్తున్న డాక్ట‌ర్ గోవింద్ నంద‌కుమార్. ఆగ‌స్టు 30వ తేదీన ఉద‌యం 10 గంట‌ల‌కు ఆయన ఓ ఆపరేషన్ చేయాల్సి వుంది. ఓ మ‌హిళకు గ్యాల్‌బాడ‌ర్ స‌ర్జ‌రీ చేయాలి. ఆపరేషన్ చేసేందుకు ఆయన ఇంటి నుంచి బ‌య‌లుదేరాడు. కానీ ఆ డాక్ట‌ర్ ఫుల్ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయాడు.

Read Also: Krishnam Raju Final Rites: అశ్రునయనాల మధ్య కృష్ణంరాజు అంత్యక్రియలు పూర్తి

స‌ర్జ‌రీకి లేట్ అవుతుందేమో అన్న కంగారులో ఆ డాక్ట‌ర్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఏం ఆలోచించకుండా డ్రైవర్ కి కారు వదిలిపెట్టి.. మూడు కిలోమీట‌ర్ల దూరం ప‌రుగులు తీశాడు. ఆ డాక్ట‌ర్‌ శ‌ర‌వేగంగా హాస్పిట‌ల్‌కు చేరుకుని స‌క్సెస్‌ఫుల్‌గా స‌ర్జ‌రీ పూర్తిచేశాడు. పేషెంట్ ఆరోగ్యంగా ఉన్నార‌ని, షెడ్యూల్ ప్ర‌కార‌మే డిశ్చార్జ్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఆయన ఆసుపత్రికి పరిగెడుతున్న వీడియోను ఇటీవల తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వృత్తి పట్ల వైద్యుడి నిబద్ధత, ఆయన మానవత్వాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. వైరల్ అవుతోంది. డాక్టర్ అంటే ఇలాగే వుండాలని.. శభాష్ డాక్టర్ సాబ్ అంటున్నారు నెటిజన్లు.

Read Also: YSRCP: పార్టీ పటిష్టతపై హైమాండ్ దృష్టి.. ప్రతి నియోజకవర్గానికి అబ్జర్వర్

Exit mobile version