NTV Telugu Site icon

Jharkhand: శ్రీరామ నవమి ఊరేగింపుపై నిషేధం.. తాలిబాన్ పాలనలో ఉన్నామా అంటూ బీజేపీ ఆందోళన

Sri Ram Navami

Sri Ram Navami

Ram Navami Procession: శ్రీరామ నవమి ఊరేగింపుపై ఆంక్షలు విధించడంపై జేఎంఎం-కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. హజారీబాగ్ లో రామనమవి ఉరేగింపుల్లో డీజే వాడొద్దని, సంప్రాదాయ కర్రల విన్యాసాలు చేయొద్దని ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీనిపై మంగళవారం జార్ఖండ్ అసెంబ్లీలో రచ్చ జరిగింది. బీజేపీ సభ్యులు జై శ్రీరాం, జై హనుమాన్ అంటూ నినాదాలు చేస్తూ ప్రభుత్వ చర్యను తప్పుపట్టారు. జార్ఖండ్ రాష్ట్రం తాలిబాన్ల పాలనలో ఉందా.? అంటూ బీజేపీ సభ్యులు ప్రశ్నించారు.

Read Also: COVID-19: దేశంలో పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే..?

హజారీబాగ్‌లోని రామనవమి ఊరేగింపులో డీజేని అనుమతించాలని బీజేపీ శాసనసభ్యుడు మనీష్ జైస్వాల్ డిమాండ్ చేశారు. ఉద్వేగానికి గురైన ఎమ్మెల్యే మనీష్ జైస్వాత్ తన కుర్తాను చించుకున్నారు. తాలిబాన్లు పాలించే రాష్ట్రంలో ప్రజలు నివసిస్తున్నారా..? అంటూ ఆశ్చర్యపోయారు. తన నియోజకవర్గం హాజారీ బాగ్ లో ఊరేగింపు సమయంలో డీజేని అనుమతించాలని డిమాండ్ చేస్తూ ఐదుగురు వ్యక్తులు ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న అమాయకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఆరోపించారు.

హజారీబాగ్‌లో 104 ఏళ్ల రామనవమి ఊరేగింపు సంప్రదాయాన్ని ధ్వంసం చేయడానికి ఉద్దేశపూర్వక ప్రయత్నం జరుగుతోందని జైస్వాల్ ఆరోపించారు. హజారీ బాగ్ లో డీజే పెట్టాలని కోరతూ ధర్నా చేసేవారు బీజేపీ కార్యకర్తలు అని మంత్రి మిథిలేష్ ఠాకూర్ ఆరోపించారు. లౌడ్ స్పీకర్ల శబ్ధ తీవ్రంతపై సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలను పాటించాలనే ఆదేశాలు ఉన్నాయని, హిందూ, ముస్లిం, సిక్కు, క్రిష్టియన్ అన్ని మతాలను మేం గౌరవిస్తున్నామని, మేమే నిజమైన రామభక్తులమని మంత్రి అన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇటీవల వందల మంది హాజారీబాగ్ లో ర్యాలీ నిర్వహించారు. ఇతర ప్రాంతాలలో పోలిస్తే ఇక్కడ రామనవమి వేడుకలు ఎక్కువ రోజులు జరుగుతాయి.