Bajrang punia: ప్రముఖ రెజర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియాలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. హర్యానా ఎన్నికల నేపథ్యంలో వీరి చేరిక కాంగ్రెస్‌కి కీలకంగా మారింది. వచ్చే నెల తొలివారంలో హర్యానా అసెంబ్లీలోని 90 స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. వరసగా రెండుసార్లు అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తుంటే, ఈ సారి ఎలాగైనా హర్యానాని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. దీని కోసం ఏ అవకాశాన్ని వదిలేయొద్దని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఫోగట్, పునియాలను చేర్చుకుంది.
Read Also: Wolf attacks: ‘‘తోడేళ్లు ప్రభుత్వం కన్నా తెలివైనవా..?’’ దాడులపై యూపీ మంత్రి అర్థం లేని మాటలు..
వచ్చే ఎన్నికల్లో హర్యానాలోని జులానా నియోజకవర్గం నుంచి వినేష్ ఫోగట్ పోటీ చేయబోతున్నారు. ఇదిలా ఉంటే, బద్లీ నుంచి పునియా పోటీ చేస్తున్నారనే వార్తలు వచ్చినప్పటికీ తాజా ఆయనకు కాంగ్రెస్ కీలక పదవిని కట్టబెట్టింది. ‘‘ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్’’ వర్కింగ్ ఛైర్మన్‌గా బజరంగ్ పునియాను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఇద్దరి చేరికతో కాంగ్రెస్ బలోపేతం అవుతుందని ఆ పార్టీ అధినాయకత్వం భావిస్తోంది. మరోవైపు ఆప్‌తో పొత్తు గురించి కాంగ్రెస్ చర్చిస్తోంది. వీరిద్దరి చేరిక ఆప్‌పై ఒత్తిడి పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది.