Babulal Marandi Comments on tribal girl molestation, killing in Jharkhand: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత బాబూలాల్ మారాండీ రాష్ట్రంలో జరిగిన మరో అత్యాచారంపై ట్వీట్ చేశారు. దుమ్కా జిల్లాలో 14 ఏళ్ల గిరిజన బాలికపై అత్యాచారం చేసి.. చెట్లుకు ఉరివేశారని ఆరోపించారు. నిందితుడు అర్మాన్ అన్సారీని అరెస్ట్ చేసినట్లు జార్ఖండ్ ప్రతిపక్ష నేత బాబూలాల్ మరాండీ ట్వీట్ లో పేర్కొన్నారు. జార్ఖండ్ లో ఎంతమంది గిరిజనులు ఇలాంటి కిరాతకాలకు బలవుతారని ప్రశ్నించారు. తను చేసిన ట్వీట్ కు కేంద్రహోం మంత్రి అమిత్ షాను ట్యాగ్ చేశారు.
జార్ఖండ్ సంతాల్ గిరిజన తెగకు చెందిన అమ్మాయని.. నిందితుడి కోరికలకు బలైపోయిందని బాబూలాల్ మరాండీ పేర్కొన్నారు. ఇది లవ్ జీహాద్ అంతర్జాతీయ నెట్ వర్క్ కు సంబంధించింది కావచ్చనే అనుమానం వ్యక్తం చేశారు. హేమంత్ సోరెన్ హయాంలో జార్ఖండ్ లోని దళితులు, గిరిజనులు సురక్షితంగా లేరని బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా ఆరోపించారు.
Read Also: Arvind Kejriwal: బీజేపీలోనే ఉండి డబ్బులు తీసుకోండి.. ఆప్ కోసం పనిచేయండి
ఇటీవల అంకాతా సింగ్ అనే 12వ తరగతి చదువుతున్న మైనర్ బాలికను అత్యంత కిరాతంగా షారుఖ్ అనే దుండగులు పెట్రోల్ పోసి నిప్పటించాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దుమ్కాలో అంకితా సింగ్ మరణించిన కొన్ని రోజుల తరువాత అర్మాన్ అన్సారీ గిరిజన మైనర్ బాలికపై అత్యాచారం చేసి, దుమ్కాలో చెట్టుకు ఉరివేశాడని.. మైనింగ్ లీజును తనకు తన కుటుంబానికి కేటాయించడంలో బిజీగా ఉన్న హేమంత్ సొరెన్ ఇవేవి పట్టించుకోవడం లేదని అమిత్ మాల్వియా ట్వీట్ చేశారు.
అక్రమ మైనింగ్ కుంభకోణంలో చిక్కుకున్న ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పై ఈసీ అనర్హత వేటు వేసింది. దీంతో తమ ఎమ్మెల్యేలను రక్షించుకోవడానికి, బీజేపీలోకి వెళ్లకుండా క్యాంపు రాజకీయానికి తెరలేపారు హేమంత్ సొరెన్, జార్ఖండ్ ముక్తీ మోర్చాతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కూడా ఇతర రాష్ట్రాలకు తరలించారు.
