Ramdev Baba apologized to women: ఎట్టకేళకు మహిళలకు బాబా రాందేవ్ క్షమాపణలు చెప్పారు. మహిళల దుస్తులపై బాబా రాందేవ్ అనుచిత వ్యాఖ్యలపై బాబా రాందేవ్‌కు మహారాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో.. బాబా రాందేవ్ క్షమాపణ లేఖ విడుదల చేశారు. మహిళలు తనలాగా దుస్తులు వేసుకోకున్నా అందంగా కనిపిస్తారు’ అంటూ యోగా గురు రామ్‌దేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దేశంలో పలు చోట్ల ఆయన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసనలు చేపడుతూ.. రామ్‌దేవ్ బేషరతుగా క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ సైతం దేశ మహిళలకు సారీ చెప్పాలని రామ్‌దేవ్‌ని ట్విటర్ మాధ్యమంగా అడిగారు. ‘‘మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ భార్య అమృతా ఫడ్నవిస్ ఎదుట రామ్‌దేవ్ మహిళల్ని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు అసభ్యకరమైనవి, ఖండించదగినవి. ఆయన ప్రసంగంతో మహిళల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈ విషయంపై రామ్‌దేవ్ క్షమాపణలు చెప్పాలి’’ అని ట్వీట్ చేశారు.
बाबा रामदेव उर्फ राम किसन यादव यांनी ठाणे येथील एका सार्वजानिक कार्यक्रमात महिलांसंबंधी अत्यंत खालच्या पातळीवर जाऊन विधान केले होते. या वक्तव्याची राज्य महिला आयोगाने गंभीर दखल घेत बाबा रामदेव उर्फ राम किसन यादव यांना याबाबतीत आपला खुलासा दोन दिवसाच्या आत सादर करण्यासाठी नोटिस१/२ pic.twitter.com/umI27luSK7
— Rupali Chakankar (@ChakankarSpeaks) November 28, 2022
महाराष्ट्र के उपमुख्यमंत्री जी की पत्नी के सामने स्वामी रामदेव द्वारा महिलाओं पर की गई टिप्पणी अमर्यादित और निंदनीय है। इस बयान से सभी महिलाएँ आहत हुई हैं, बाबा रामदेव जी को इस बयान पर देश से माफ़ी माँगनी चाहिए! pic.twitter.com/1jTvN1SnR7
— Swati Maliwal (@SwatiJaiHind) November 26, 2022
తెలంగాణలోనూ రామ్‌దేవ్ వ్యాఖ్యలపై మహిళా కాంగ్రెస్ నిరసన నిరసనలు చేసింది. నిరసనకారులు రామ్‌దేవ్ బాబా దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ నిరసనల్లో మాజీ మంత్రి గీతారెడ్డితో పాటు ఇతర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. సీపీఐ నారాయణ సైతం రామ్‌దేవ్ చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. యోగా పేరుతో కార్పొరేట్ వ్యవస్థను నడుపుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.దేశంలో చాలా చోట్ల మహిళా సంఘాలు, రాజకీయ పార్టీల మహిళా విభాగాలు రామ్‌దేవ్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ముంబై మహిళా పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో థానేలో ఓ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వందలమంది మహిళలు విచ్చేశారు. అయితే.. వారిలో చాలామందికి చీరలు ధరించే సమయం దొరక్కపోవడంతో, శిబిరానికి సాధారణ దుస్తుల్లోనే వచ్చేశారు. ఇది గమనించిన రామ్‌దేవ్.. మహిళలు చీరల్లో బాగుంటారని, సల్వార్ – సూట్స్‌లో కూడా బాగానే కనిపిస్తారన్నారు. అక్కడితో ఆగకుండా.. తనలాగా దుస్తులు వేసుకోకుండా అందంగానే కనిపిస్తారని రామ్‌దేవ్ బాంబ్ పేల్చారు. ఈ కామెంట్‌పై రామ్‌దేవ్ పక్కనే ఉన్న అమృతా, కార్యక్రమానికి వచ్చిన మహిళలు నవ్వడం ఆశ్చర్యకరం.